ETV Bharat / bharat

'దేశంలో 68శాతం కేసులు తగ్గాయ్​'​ - భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ టీకాకు డబ్ల్యూహెచ్​ఓ గుర్తింపు

దేశంలో ప్రస్తుతం 68శాతం మేర కేసులు క్షీణించాయని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వివరించారు. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చురుగ్గా సాగుతుందని ఆయన తెలిపారు.

lav agarwal
లవ్ అగర్వాల్
author img

By

Published : Jun 4, 2021, 9:10 PM IST

దేశంలో మే 7న నమోదైన రికార్డు స్థాయి కేసులతో పోలిస్తే ప్రస్తుతం 68శాతం మేర కేసులు క్షీణించాయని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ అన్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చురుగ్గా సాగుతుందన్న ఆయన 60ఏళ్లు పైబడిన 43శాతం మందికి, 45 నుంచి 60ఏళ్ల మధ్య ఉన్న 37శాతం మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు చెప్పారు.

అమెరికాను మించి..

దేశంలో ఇప్పటివరకు 17.2కోట్ల మంది కనీసం ఒక డోసు తీసుకున్నారని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ అన్నారు. తొలి డోసు టీకాల విషయంలో అమెరికాను అధిగమించినట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో రోజువారీ కేసుల్లో 66శాతం 5 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 377 జిల్లాల్లో 5శాతం లోపే పాజిటివిటీ రేటు ఉన్నట్లు చెప్పింది. 257జిల్లాల్లో నిత్యం వందకు పైగా కేసులు వస్తున్నట్లు చెప్పిన ఆరోగ్యశాఖ మరో 100 జిల్లాల్లో నిరంతరం కేసులు తగ్గుతున్నట్లు పేర్కొంది.

మరోవైపు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ టీకా ప్రపంచ స్థాయి గుర్తింపునకు కావాల్సిన సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పంచుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది.

ఇవీ చదవండి: 'టీకాలపై ఆ నివేదికలన్నీ అవాస్తవాలే'

వ్యాక్సిన్‌ వేసుకున్న వాళ్లకే 'కిక్‌'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.