ETV Bharat / bharat

ఆర్డర్​ చేసిన పది నిమిషాల్లో మద్యం హోండెలివరీ!

10 min liquor delivery service: పది నిమిషాల్లో మద్యం హోం డెలివరీ చేసే సేవలు ప్రారంభించింది హైదరాబాద్​కు చెందిన ఓ స్టార్టప్ సంస్థ. బూజీ అనే బ్రాండ్​తో కోల్​కతా నగరంలో ఈ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది.

10 min liquor delivery service
10 min liquor delivery service
author img

By

Published : Jun 2, 2022, 5:36 PM IST

10 min liquor delivery service: ఆన్​లైన్​ డెలివరీ సంస్థలకు డిమాండ్​ బాగా పెరుగుతోంది. ఇప్పటికే ఫుడ్​, షాపింగ్​ రంగాల్లో ఆన్​లైన్​ ఆర్డర్స్​ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్​కు చెందిన ఓ స్టార్టప్​ సంస్థ పది నిమిషాల్లో మద్యం డెలివరీ చేసే సేవను ప్రారంభించింది. బూజీ అనే బ్రాండ్​తో కోల్​కతా నగరంలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని ఇన్నోవెంట్​ టెక్నాలజీస్​ ప్రైవేట్​ లిమిటెడ్​ ప్రకటించింది.

ఇప్పటికే మద్యం డెలివరీ చేసే సంస్థలు ఉన్నాయని.. కానీ పది నిమిషాల్లో చేసే సంస్థ తమదేనని పేర్కొంది. ఎక్సైజ్​శాఖ అనుమతి పొందిన తర్వాత కోల్​కతాలోని తూర్పు ప్రాంతంలో ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. మద్యం డెలివరీ చేసేలా బంగాల్​ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని బూజీ సంస్థ సీఈఓ వివేకానంద తెలిపారు. కల్తీ మద్యం, మైనర్లకు డెలివరీ చేయకుండా నిబద్ధతతో పనిచేస్తామని ఆయన చెప్పారు.

ఇప్పటికే బంగాల్​లో స్విగ్గీ మద్యం డెలివరీ సర్వీస్​ను అందుబాటులోకి తెచ్చింది. ఆన్​లైన్​లో మద్యం ఆర్డర్​ ఇచ్చేందుకు వినియోగదారులు.. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, సెల్ఫీ ఫొటోను అప్​లోడ్​ చేసి వయస్సు ధ్రువీకరించాల్సి ఉంటుందని స్విగ్గీ తెలిపింది. వన్​టైమ్​​ ఇన్​స్టంట్​ ఏజ్​ వెరిఫికేషన్​ పేరుతో ఈ ప్రక్రియ జరుగుతుంది. సగటున ఒక వినియోగదారుడికి ఎంత మద్యం విక్రయించాలనే విషయంపైనా బంగాల్​ ప్రభుత్వం పరిమితులు విధించినట్లు స్విగ్గీ తెలిపింది. దీనితో పరిమితి దాటిన తర్వాత వినియోగదారులు ఆర్డర్ ఇవ్వలేరని స్పష్టం చేసింది. ఈ సేవలు పొందాలునుకునే వారు స్విగ్గీ యాప్​ను అప్​డేట్​ చేసుకోవాల్సి ఉంటుందని వివరించింది.

ఇదీ చదవండి: స్మార్ట్​ సిటీలో యువకులకు పెళ్లి కష్టాలు.. నీళ్లే కారణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.