ETV Bharat / bharat

Srinagar attack: పోలీసు బస్సుపై ఉగ్రదాడి ఘటనలో మరొకరు మృతి

author img

By

Published : Dec 14, 2021, 11:11 AM IST

Srinagar attack: జమ్ముకశ్మీర్‌లో పోలీసు బస్సుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అమరులైన పోలీసుల సంఖ్య మూడుకు పెరిగింది. మిగిలిన 11 మంది ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Srinagar attack
Srinagar attack

Srinagar attack: జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​లోని పోలీసు బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనలో మరో పోలీసు మరణించారు. తీవ్ర గాయలతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఫలితంగా ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది. మిగిలిన 11 మంది ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సీయనిర్​ పోలీసు అధికారులు తెలిపారు.

కంగన్​కు చెందిన కానిస్టేబుల్​ రజీమ్​ అహ్మద్ మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పోగా.. ఘటనా స్థలంలోనే సబ్​ఇన్​స్పెక్టర్​, సీనియర్ గ్రేడ్​ కానిస్టేబుల్​ అమరులయ్యారు.

శ్రీనగర్‌ శివారులోని జెవాన్‌ ప్రాంతంలో సోమవారం సాయంత్రం 5:50 గం. సమయంలో పోలీసు బస్సుపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఏఆర్​ పోలీసు తొమ్మిదో బెటాలియన్​.. శ్రీనగర్​లో తమ విధులు ముగించుకుని పంతా చౌక్ మీదుగా జెవాన్​లోని ఆర్మ్డ్ పోలీసు కాంప్లెక్స్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

దీని గురించి మాట్లాడిన కశ్మీర్​ ఇన్‌స్పెక్టర్​ జనరల్​ ఆఫ్​ పోలీస్​ విజయ్ కుమార్.. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కశ్మీర్​ టైగర్స్​ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం ఉందని చెప్పారు. బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ ముష్కరుడు గాయపడినట్లు తెలిపారు. దాడికి పాల్పడినవారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.

ఇదీ చూడండి: పోలీస్ బస్​పై ఉగ్రవాదుల దాడి- ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.