ETV Bharat / bharat

శ్రీలంక అధ్యక్షుడితో మోదీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా కీలక చర్చలు - రణిల్ విక్రమ సింఘె మోదీ​ భేటీ

Sri lanka President In India Visit 2023 : పొరుగు దేశం శ్రీలంకతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు మోదీ.. రెండ్రోజుల పర్యటన నిమిత్తం భారత్​ వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘెతో మోదీ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య దీర్ఘకాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఇరువురు నేతలు చర్చించారు.

Sri lanka President In India Visit 2023
Sri lanka President In India Visit 2023
author img

By

Published : Jul 21, 2023, 3:11 PM IST

Updated : Jul 21, 2023, 4:49 PM IST

Sri lanka President In India Visit 2023 : మిత్రదేశం శ్రీలంకతో ఎప్పటిలాగానే సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శ్రీలంక ప్రభుత్వం అక్కడి తమిళుల ఆకాంక్షలు నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత పర్యటనలో ఉన్న శ్రీలంక అధ్యక్షుడు.. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపి పలు ఒప్పందాలు చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య దీర్ఘకాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఇరువురు నేతలు చర్చించారు. గత ఏడాది.. శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తర్వాత ఆ దేశ అధ్యక్షుడు తొలిసారి భారత్‌ వచ్చారు. శ్రీలంకలో సంక్షోభం నెలకొన్న సమయంలో భారత్ అండగా నిలిచింది. దాదాపు 4 బిలియన్‌ డాలర్ల మేర ఆర్థిక తోడ్పాటుతోపాటు ఔషధ సామగ్రి వంటి రూపాల్లో సాయం అందించిన భారత్‌కు ఈ సందర్భంగా విక్రమసింఘె ధన్యవాదాలు తెలిపారు.

"భారత్‌-శ్రీలంక మధ్య విమానయాన కనెక్టివిటీని పెంపొందించడానికి ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరింది. ప్రజల వాణిజ్యం, ప్రయాణాలను పెంపొందించడానికి తమిళనాడులోని నాగపట్నం-శ్రీలంకలోని కంకేసంతురై మధ్య ప్యాసింజర్ ఫెర్రీ సేవలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం. శ్రీలంకలో యూపీఐని ప్రారంభించేందుకు సంతకం చేసిన ఒప్పందం.. ఫిన్‌టెక్ కనెక్టివిటీని పెంచుతుంది."

--నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

భారత్ అభివృద్ధి పొరుగు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని రణిల్ విక్రమసింఘె అన్నారు. దక్షిణ భారతదేశం నుంచి శ్రీలంకకు బహుళ-ప్రాజెక్ట్ పెట్రోలియం పైప్‌లైన్ నిర్మాణం శ్రీలంకకు ఇంధన వనరులను అందిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఇరు దేశాలకు సంబంధించిన సముద్ర జలాల్లో మత్స్యకారుల సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని అంగీకరించినట్లు ప్రధాని మోదీ వివరించారు.

శ్రీలంక అధ్యక్షుడితో అదానీ భేటీ
శ్రీలంకలో కొత్తగా హరిత హైడ్రోజన్​ ప్లాంట్​ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ. భారత పర్యటనలో ఉన్న శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘెను కలిసి ఈ విషయాన్ని తెలియజేశారు. ఇప్పటికే 500 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్ట్ సహా ఓ భారీ కంటైనర్​ టెర్మినల్​ను నిర్మిస్తోంది అదానీ సంస్థ. కొలంబలో సుమారు 700 మిలియన్ డాలర్ల ఖర్చుతో కంటైనర్ టెర్మినల్​ను అభివృద్ధి చేస్తోంది.

Last Updated : Jul 21, 2023, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.