రష్యాకు చెందిన స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆమోదం తెలిపింది. కొవిడ్‌కు వ్యతిరేకంగా ఈ టీకా 78.7 శాతం నుంచి 83.7 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉందని ఇటీవల లాన్సెట్ ఓ అధ్యయనం ప్రచురించింది. ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు డోసుల టీకాల కంటే గొప్పగా పని చేస్తుందని పేర్కొంది. ఈ ప్రచురణ అనంతరం ట్రయల్స్‌కు డీసీజీఐ ఆమోదం లభించింది.
అయితే జులైలోనే మూడోదశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి స్పుత్నిక్ మొగ్గు చూపినా... నిపుణుల కమిటీ ఆమోదం తెలపలేదు. అంతేగాకుండా అత్యవసర వినియోగానికి నిరాకరించింది. అయితే భారత్‌లో దీని పనితీరు, ప్రభావం ఎలా ఉంటుందని ఇప్పటికే నిర్వహించిన ట్రయల్స్ ద్వారా నిపుణులు గుర్తించారు.
97.2 శాతం సమర్థవంతం..
స్పుత్నిక్ వీ టీకా 97.2 శాతం సమర్థవంతంగా పని చేసిందని బెలారస్ ఆరోగ్య శాఖ తెలిపినట్లు స్పుత్నిక్ వీ తయారీ సంస్థ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్) పేర్కొంది.
ఇదీ చూడండి: Corona cases in India: దేశంలో కొత్తగా 27వేల కరోనా కేసులు