ETV Bharat / bharat

మరణించిన 14 రోజులకు అంత్యక్రియలు- ఆత్మ ఇప్పుడే వీడిందని... - కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లా వార్తలు తాజా

కర్ణాటకలో గెషే ఫుంట్‌సోక్ అనే బౌద్ధ సన్యాసి మరణించిన 14 రోజుల తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు భిక్కులు. ఇన్ని రోజులు గెషే శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టలేదని నమ్మి, ఇలా చేశారు.

buddhist monk funeral karnataka
మరణించిన 14 రోజులకు సన్యాసికి అంత్యక్రియలు!
author img

By

Published : Sep 24, 2021, 2:39 PM IST

ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టలేదన్న కారణంతో.. గెషే ఫుంట్​సోక్​ (90) అనే బౌద్ధ సన్యాసి మృతదేహానికి గత కొన్ని రోజులుగా అంత్యక్రియలు నిర్వహించని అనుచరులు, ఎట్టకేలకు గురువారం దహనసంస్కారాలు జరిపారు. గెషే మరణించిన 14 రోజుల తర్వాత ఆయన శరీరానికి దహన సంస్కారాలు చేయడం గమనార్హం. ఈ ఘటన కర్ణాటకలోని జరిగింది.

d
గెషే ఫుంట్​సోక్​ పార్దివదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సన్యాసులు

ఉత్తర కన్నడ జిల్లా ముందగొడు తాలూకాలోని టిబెటన్​ కాలనీలో నివాసముంటున్న గెషే సన్యాసి.. ఈ నెల 9న పరమపదించారు. అనంతరం ఆయన పార్థివదేహాన్ని భద్రపరిచిన భిక్కులు.. రోజూ ప్రార్థనలు చేసేవారు. ఆయన ఆత్మ.. దేహాన్ని విడిచిపెట్టిందా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు.. సన్యాసుల్లో ఒకరు ఎప్పటికప్పుడు ఆ గదిలోకి వెళ్లి చూసి వచ్చేవారు. నోరు, ముక్కులో నుంచి ద్రవం బయటకు వచ్చినా, వాసన వచ్చినా ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినట్టు వారు విశ్వసిస్తారు.

ఇప్పుడు ఆ ఆత్మ, గెషే శరీరాన్ని విడిచిపెట్టిందని భావించిన భిక్కులు.. ఆయన శరీరానికి అంత్యక్రియలు నిర్వహించారు.

టిబెటన్​ కాలనీలో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. నలుగురు సన్యాసులు.. దేహాన్ని విడిచిపెట్టగా.. ఆ తర్వాత వారికి పూజలు చేశారు. 7-15 రోజుల మధ్య వారి అంత్యక్రియలు జరిగాయి.

ఇదీ చూడండి : నదిలో కొట్టుకుపోయిన ఏనుగులు- కాపాడేందుకు అధికారుల యత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.