నిమజ్జనానికి వెళ్తున్న గణపతి విగ్రహాలను చూస్తున్న ప్రజలపైకి ఓ స్కార్పియో (Scorpio) దూసుకెళ్లింది. రహదారి పక్కనే నిల్చొని ఉండగా.. వేగంగా వెళ్తున్న ఈ వాహనం వారిని ఢీకొట్టింది. ఝార్ఖండ్ రామ్‌గఢ్ పట్టణంలోని (Jharkhand's Ramgarh) జెండా చౌక్ వద్ద ఈ ఘటన జరిగింది.

ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వీరందరినీ ఆస్పత్రికి తరలించారు. స్కార్పియోను గుర్తించిన పోలీసులు.. త్వరలోనే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.

ఈడ్చుకెళ్లి...
వీక్షకులను ఢీకొట్టిన స్కార్పియో డ్రైవర్.. 50 మీటర్ల వరకు వారిని ఈడ్చుకెళ్లాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం తర్వాత ఆగేందుకు ప్రయత్నించలేదని వెల్లడించారు.

ఈ ఘటన అనంతరం పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఫోన్ కోసం అక్కాతమ్ముళ్ల గొడవ- చూస్తుండగానే విషం తాగి...