ETV Bharat / bharat

యుద్ధవిమానాలు నడిపి.. ఇప్పుడు జంతువులతో సావాసం! - శోయబ్​ అలామ్​ చరిత్ర

ఈయన పేరు మొహమ్మద్ శోయబ్ అలాం. విశ్రాంత వైమానిక దళ అధికారి. అనుకోని కారణాలతో ఒంటరిగా బతకాల్సిరావడం వల్ల.. జంతువులనే కుటుంబ సభ్యులుగా మార్చుకున్నారాయన. రోజంతా వాటితోనే గడుపుతూ.. కంటికి రెప్పలా సాకుతున్నారు.

Retired Airforce officer Mohammed Shoaib Alam
శోయబ్​ అలామ్​, పెంపుడు జంతువుల ప్రేమికుడు
author img

By

Published : May 1, 2021, 10:42 AM IST

పెంపుడు జంతవులతో సాావాసం చేస్తున్న శోయబ్​ అలాం

ఉత్తరాఖండ్​ మసూరీలోని హాథీ పావోన్‌ ప్రాంతంలో నివాసముంటున్న శోయబ్.. శునకాలు, ఆవులతోనే సహవాసం చేస్తున్నారు. రోజూ వాటితోనే కాలం గడుపుతారు, మాట్లాడతారు, కలిసి భోజనం కూడా చేస్తారు. వాటికి కూడా శోయబ్ అంటే ఎనలేని అభిమానం.

"గడిచిన నాలుగేళ్ల నుంచీ ఈ జంతువుల బాధ్యతలు చూసుకుంటున్నా. నా జీవితం పర్వతాలకు, జంతువులకే అంకితం. నాకు ప్రకృతి అంటే విపరీతమైన ఇష్టం."

- మొహమ్మద్ శోయబ్ అలాం, విశ్రాంత వైమానికదళ అధికారి

కంటివ్యాధితో విధులకు దూరమై..

దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో 1988లో వైమానిక దళంలో చేరారు శోయబ్. జాగ్వార్, మిరాజ్‌ యుద్ధ విమానాలను నడిపిన అనుభవజ్ఞుడాయన. ఎనిమిదేళ్లు విధులు నిర్వర్తించిన తర్వాత, 1996లో ఓ అరుదైన కంటివ్యాధి ఆయన్ను ఇబ్బంది పెట్టింది. ఫలితంగా.. విధులను వదిలి పెట్టాల్సి వచ్చింది.

"కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. చిన్నచిన్న సవాళ్లుంటాయి. కానీ ప్రయత్నిస్తూనే ఉంటా."

- మొహమ్మద్ శోయబ్ అలాం, విశ్రాంత వైమానిక దళ అధికారి

ఇదీ చదవండి: కరోనా బాధితులకు అండగా 'ఆదర్శ కుటుంబం'

సొంత కుటుంబ సభ్యుల్లా..

2015లో మొహమ్మద్ శోయబ్.. మసూరీకి మకాం మార్చారు. అక్కడే కొన్నాళ్లపాటు పారాగ్లైడింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం.. పెంపుడు కుక్కలు, ఆవులతో కలిసి జీవిస్తున్నారు. తనవద్ద పెద్దమొత్తంలో డబ్బు లేకపోయినా.. ఉన్నదాంట్లోనే తన స్నేహితులను జాగ్రత్తగా చూసుకుంటున్నానని చెప్తున్నారు శోయబ్. ప్రస్తుతం.. ఆయన వద్ద 6 శునకాలున్నాయి. వాటి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈయన వద్దనుంచి పర్యటకులు చాలాసార్లు పెంపుడు కుక్కలను తీసుకెళ్లారు. తనతో ఉన్న జంతువులను మాత్రం సొంత కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటారు.

"ఎవరూ లేని, అనాథ జంతువుల కోసం నేను పనిచేస్తా."

ఆ తర్వాతే ఆయన భోజనం..

కుక్కలు, ఆవులకు రోజుకు రెండుపూటలా భోజనం పెడతారు అలాం. ఆ తర్వాతే ఆయన భోంచేస్తారు.

"నాకొచ్చే నిధులను, నేను సంపాదించే డబ్బంతా ఈ జంతువుల కోసమే ఖర్చుపెడతా. పిండి, బియ్యం, రొట్టెలు, పప్పులు సేకరించి, వాటికి ఆహారంగా పెడతా."

ఆదర్శంగా..

తమ గురించీ, తమ పిల్లలు, మనవల గురించి మాత్రమే ఆలోచించే మనుషులున్న ఈ రోజుల్లో.. జంతువుల పట్ల అమితమైన ఆప్యాయతను కురిపిస్తున్న శోయబ్‌.. ఓ చక్కటి జీవిత పాఠం నేర్పిస్తున్నారు.

ఇదీ చదవండి: మే డే: కార్మిక చట్టాలకు కొత్త రూపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.