Beauty Parlour Girl Gang Rape: దిల్లీలో దారుణం జరిగింది. బ్యూటీపార్లర్‌లో (స్పా) విధులు నిర్వహిస్తున్న ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. పార్లర్ మేనేజర్‌తో పాటు ఓ కస్టమర్ కలసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కొన్నాళ్ల క్రితం బాధితురాలు.. పితాంపుర ప్రాంతంలో ఉన్న ఓషన్ స్పాలో చేరింది. అయితే శుక్రవారం రాత్రి పార్లర్ మేనేజర్ రాహుల్, కస్టమర్ సతీశ్.. మత్తుపదార్థాలు సేవించి పార్లర్‌కు వచ్చారు. ఆ సమయంలో పార్లర్లో ఉన్న బాధితురాలిపై సామూహిక అత్యాచారం చేశారు. వెంటనే బాధితురాలు మౌర్య ఎన్క్లేవ్ పోలీస్‌స్టేషన్‌కు కాల్ చేసి చెప్పింది. హుటాహుటిన పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మేనేజర్, కస్టమర్‌ను అరెస్ట్ చేశారు. బాధితురాల్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని, విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.
35 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్.. సీఎం సీరియస్
మహారాష్ట్రలోని భండారా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. 35 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం రోడ్డుపై పడేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే.. సీరియస్ అయ్యారు. సిట్ ద్వారా విచారణ జరిపించాలని ఆదేశించారు.
ఇవీ చదవండి: ఎన్నికల్లో గెలిచింది భార్యలు.. ప్రమాణస్వీకారం చేసిందేమో భర్తలు!
సైకిల్‌పై వెళ్తూ డ్రైనేజీలో పడ్డ బాలిక.. 2 గంటల రెస్క్యూ ఆపరేషన్.. చివరకు...