ETV Bharat / bharat

'చంపేస్తా లేదా చస్తా'.. పిస్టల్​తో MLA హల్​చల్​.. పోలీసులను బూతులు తిడుతూ.. - పిస్టల్​తో ఎమ్మెల్యే హల్​చల్

సమాజ్​వాదీ పార్టీకి చెందిన ఓ శాసనసభ్యుడు పోలీస్ స్టేషన్​ ఎదుట హల్​చల్​ చేశారు. పిస్టల్​తో తనను తాను కాల్చుకుంటానని లేదా వేరే వ్యక్తినైనా కాల్చేస్తానని బెదిరించారు. అలాగే పోలీసులను దుర్భాషలాడారు. గాజులు తొడుక్కొవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

mla hustle in up
mla hustle in up
author img

By

Published : May 10, 2023, 10:42 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో సమాజ్​వాదీ పార్టీ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ ఎదుట హల్​చల్ చేశారు. పిస్టల్​ తీసి పోలీసులను బెదిరించారు. 'కాల్చేస్తా లేదా తానైనా కాల్చుకుంటానని' పోలీసులను బెదిరించారు. అక్కడితో ఆగకుండా పోలీసులను దుర్భాషలాడారు. గాజులు వేసుకోమని విమర్శించారు. పక్కనే ఉన్న పార్టీ కార్యకర్తలు, అనుచరులు ఆయనను ఆపడం వల్ల శాంతించారు. పోలీసులపై కోపంతో సమాజ్​వాదీ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఇంతకీ ఏం జరిగిందంటే..
ఉత్తర్​ప్రదేశ్​లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశ పోలింగ్​ మే 4న జరగగా.. రెండో దశ పోలింగ్ మే 11న జరగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం సమాజ్​వాదీ పార్టీ నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమేఠీలో సమాజ్​వాదీ పార్టీ శాసనసభ్యుడు రాకేశ్​ ప్రతాప్​ సింగ్​, బీజేపీ నేత దీపక్ సింగ్​కు బుధవారం మధ్యాహ్నం గొడవ జరిగింది. దీపక్ సింగ్ భార్య గౌరీగంజ్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. తమపై దాడి చేసిన బీజేపీ నేతలపై పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేయడం లేదని రాకేశ్ ప్రతాప్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నేతలు అక్రమాలకు పాల్పడినా పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గౌరీగంజ్ పోలీస్ స్టేషన్ ఎదుట తన అనుచరులతో కలిసి ఎస్పీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ ధర్నాకు దిగారు. ఆయనను సముదాయించేందుకు ప్రయత్నించిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీపక్​ సింగ్​ను కాల్చేస్తానని.. లేదంటే తానైనా కాల్చుకుంటానని పోలీసుల ఎదుట హల్​చల్​ చేశారు ఎస్పీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్. అంతకుముందు దీపక్ సింగ్​పై తన అనుచరులతో కలిసి గౌరీగంజ్ పోలీస్ స్టేషన్​లో దాడి చేశారు రాకేశ్ సింగ్. పోలీసులు అడ్డుకోవడం వల్ల ఆయన మరింత కోపంతో రగిలిపోయారు. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్ల పోలీసులు భారీగా మోహరించారు.

'చంపేస్తా లేదా చస్తా'.. పిస్టల్​తో ఎమ్మెల్యే హల్​చల్​

టోల్‌ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి..
ఇటీవల.. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తీరు వివాదస్పదమైంది. ఓ టోల్‌ప్లాజా వద్ద అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై ఆయన చేయిచేసుకున్నారు. టోల్‌ప్లాజా వద్ద పనిచేస్తున్న ఓ వ్యక్తి చెంపపై కొట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.