ETV Bharat / bharat

ఇండోర్​ వృద్ధుల కోసం సోనూసూద్​ విరాళాల సేకరణ - సోనూసూద్​ ఇండోర్​ వృద్దుల కోసం

కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడానికి 'నేనున్నాను' అని చాటే నటుడు సోనూసూద్..​ మరోసారి అదే విధంగా ముందుకొచ్చారు. మధ్యప్రదేశ్​ ఇండోర్​లో మున్సిపల్​ అధికారుల దాష్టీకానికి గురైన అభాగ్యులకు సాయపడేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇందుకోసం విరాళాల సేకరణ (క్రౌడ్​ ఫండింగ్​) కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు.​

Sonu Sood crowd funding
ఇండోర్​ వృద్ధుల కోసం సోనూసూద్​ 'క్రౌడ్ ఫండిగ్​'
author img

By

Published : Jan 31, 2021, 12:56 PM IST

మధ్యప్రదేశ్​లో నిలువ నీడలేని అభాగ్యులపై ఇండోర్​ మున్సిపాలిటీ అధికారులు ప్రవర్తించిన తీరుపై నటుడు సోనూసూద్​ అసహనం వ్యక్తం చేశారు. ఆ వృద్ధులను ఆదుకునేందుకు ఆయన నడుం బిగించారు. వారికి ఇళ్లు నిర్మించేందుకు 'క్రౌడ్ ​ఫండింగ్'​ రూపంలో నిధులు సేకరించేందుకు సిద్ధమయ్యారు.

యువత తమ తల్లితండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని సోనూసూద్​ కోరారు. ఇండోర్​ వృద్ధుల కోసం విరాళాలు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు.

ఇండోర్​ వృద్ధుల కోసం సోనూసూద్​ 'క్రౌడ్ ఫండిగ్​'

అసలేం జరిగింది..?

ఇండోర్​ నగరంలో నిరాశ్రయులైన వృద్ధుల పట్ల మున్సిపల్ సిబ్బంది అమానవీయంగా వ్యవహరించారు. నగరంలో నిలువ నీడ లేక అల్లాడుతున్న అభాగ్యులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి జాతీయ రహదారి పక్కన శివార్లలో వదిలేశారు. దీంతో వారంతా చలికి వణుకుతూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారగా.. మున్సిపల్​ అధికారులు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.

Sonu Sood crowd funding
ఇండోర్​లో వృద్ధులు

ఇదీ చదవండి:సుప్రీంకోర్టుకు నటుడు సోనూసూద్ కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.