ETV Bharat / bharat

తండ్రికి గుడికట్టిన నలుగురు అన్నదమ్ములు.. నిత్యం పూజలు - తల్లిదండ్రులకు గుడి

తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చుతున్న కుమారులు ఉన్న ఈ రోజుల్లో.. తమ తండ్రి జ్ఞాపకార్థం గుడి కట్టి నిత్యం పూజలు చేస్తున్నారు కర్ణాటకకు చెందిన నలుగురు అన్నదమ్ములు. గుడిలో పూజారిగా చేస్తూ.. ఇతరులకు అండగా నిలిచిన తమ తండ్రి అందరికి ఆదర్శమని పేర్కొంటున్నారు.

sons build temple for late father
తండ్రికి గుడి కట్టిన కుమారులు
author img

By

Published : Jun 11, 2022, 7:28 PM IST

Updated : Jun 12, 2022, 12:42 PM IST

జీవితాంతం కుటుంబం కోసం శ్రమించిన తండ్రిని.. వృద్ధాప్యంలో ఆశ్రమాల్లో వదిలిపెడుతున్న కుమారుల్ని చూస్తున్నాం. ప్రస్తుత రోజుల్లో ఈ ట్రెండ్​ మరింత ఎక్కువైంది. ఆస్తి కోసం తండ్రినే చంపుతున్న కిరాతుకుల్నీ చూస్తున్నాం. కానీ, గుడిలో పూజారిగా చేస్తూ ఇతరులకి అండగా నిలిచిన తన తండ్రి జ్ఞాపకార్ధంగా.. గుడి కట్టిన కుమారుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

sons build temple for late father
తండ్రి విగ్రహం

కర్ణాటకలోని కొప్పల్‌ జిల్లాకి చెందిన నలుగురు కుమారులు క్రిష్ణప్ప, బెట్టదప్ప, హనుమంతప్ప, నాగరాజ్​లకు వారి తండ్రి అంటే చాలా ఇష్టం. కూకనపల్లి గ్రామ గుడిలో పూజారిగా పనిచేసిన వారి తండ్రి తిమ్మన్న.. ఇతరులకు సహాయం చేస్తూ జీవించేవారని చెబుతున్నారు. ఆయన చివరి రోజుల వరకు ఎంతో బాగా చూసుకున్నామని అంటున్నారు. తిమ్మన్న పూజారి 2005లోనే మృతి చెందారు. అప్పుడే.. తమ తండ్రి జ్ఞాపకార్థం గుడి కట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కానీ.. ఆర్థిక పరిస్థితి అంత మెరుగ్గా లేకపోవడం వలన నిర్మించలేక పోయామని తెలిపారు.

sons build temple for late father
పూజలు చేస్తున్న కుమారులు

తండ్రి తిమ్మన్న చనిపోయి చాలా రోజులైనా.. ఆయన జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయని కుమారులు చెప్పారు. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు నిర్మించుకునే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. నలుగురు కుమారులు కలిసి.. తమ పొలంలో గుడిని నిర్మించుకున్నారు. అందులో తిమ్మన్న పూజారి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు రూ. 2.50 లక్షలు ఖర్చు చేశారు. విగ్రహాన్ని కర్ణాటకలోని విజయనగరం జిల్లా హొసపేటెలో తయారుచేయించారు. గుడిలో ప్రతిష్ఠించి రోజూ.. తమ తండ్రికి పూజలు చేస్తూ ఆరాధిస్తున్నారు.

ఇదీ చూడండి: వరుడు కావాలని యాడ్ ఇచ్చిన యువతి.. అబ్బాయి అలా ఉంటేనే పెళ్లి..!

భార్య కోసం.. జైలులో 50 రోజులుగా నిరాహార దీక్ష

Last Updated : Jun 12, 2022, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.