ETV Bharat / bharat

గవర్నర్​ పదవికి యడ్డీ నో- కొత్త పార్టీ పెడతారా? - కర్ణాటక సీఎం యడియూరప్ప

కర్ణాటకలో సుదీర్ఘ ఊహాగానాలకు తెరపడింది. సీఎం కుర్చీలో నుంచి బీఎస్ యడియూరప్ప దిగిపోయారు. అయితే తర్వాత ఏంటి? యడియూరప్ప భవిష్యత్ ప్రణాళికలు రచించుకున్నారా? ప్రజల మధ్యే ఉంటానంటున్న యడ్డీ.. రాష్ట్రంలో సరికొత్త రాజకీయానికి తెరలేపుతారా?

yediyurappa
భాజపాకు గుడ్​బై- యడియూరప్ప కొత్త పార్టీ?
author img

By

Published : Jul 27, 2021, 1:56 PM IST

కర్ణాటకలో సీఎం పదవిని వదులుకున్న బీఎస్ యడియూరప్ప.. తర్వాతి అడుగు ఎటువైపు వేస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది. రాష్ట్ర రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా జరుగుతున్న తీవ్ర చర్చకు ఫుల్​స్టాప్ పెడుతూ సోమవారమే తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు యడ్డీ. గవర్నర్​ను కలిసి.. రాజీనామా లేఖను సైతం సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆయనకు భాజపా అధిష్ఠానం ఏ పదవిని కట్టబెడుతుందనే విషయం చర్చనీయాశంగా మారింది.

గవర్నర్ పదవికి నో!

ముఖ్యమంత్రి పదవిని వదులుకున్న యడ్డీని.. ఏదైనా రాష్ట్రానికి గవర్నర్​గా పంపాలని భాజపా అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను యడియూరప్ప నిర్ద్వంద్వంగా తోసిపుచ్చినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రియాశీల రాజకీయాల్లోనే ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని సన్నిహత వర్గాలు చెబుతున్నాయి.

'కేంద్రానికి వెళ్లను'

కేంద్రంలో ఎలాంటి పదవి చేపట్టే అవకాశం లేదని యడ్డీ తేల్చి చెప్పారు. 'వాజ్​పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రి పదవిని తిరస్కరించా. భవిష్యత్​లో కేంద్రంలో ఎలాంటి పదవి చేపట్టను' అని సోమవారం తన ప్రసంగంలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో.. భాజపాకు గుడ్​బై చెప్పి కొత్తగా పార్టీ ఏర్పాటు చేస్తారా అన్న వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో తెరపైకి వస్తున్నాయి. లింగాయత్​ వర్గాల్లో పట్టున్న యడ్డీ.. 2012లో మాదిరిగానే వేరు కుంపటి పెడతారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

కొడుకుల కోసమే

యడ్డీ భాజపా నుంచి వేరువడితే.. తన ఇద్దరు కుమారుల పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారుతుంది. నిజానికి ఈ కారణంతోనే గవర్నర్ పదవిని యడియూరప్ప తిరస్కరించారని సమాచారం. గవర్నర్​గా ఎంపికైతే తన కొడుకుల్లో ఒకరు కర్ణాటకను వదిలి తన వెంటే ఉండాల్సి వస్తుందని, అది వారి రాజకీయ భవిష్యత్​ను నాశనం చేస్తుందని యడ్డీ భావిస్తున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్​గా ఓ రాజ్​భవన్​కు పరిమితం కాకుండా.. కర్ణాటక ప్రజల మధ్యే ఉండాలని యడియూరప్ప కోరుకుంటున్నారని తెలుస్తోంది.

ఇదీ చదవండి:

యడియూరప్పకు ఆ రెండేళ్లు సవాళ్ల సవారీనే!

నాలుగు సార్లు సీఎం.. కానీ ఎన్నడూ ఐదేళ్లు ఉండలేదు

కమలదళంలో మాస్ లీడర్ల కొరత

కర్ణాటక కొత్త సీఎం ఎవరో తేల్చే బాధ్యత కిషన్​ రెడ్డిదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.