కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ 3 కమిటీలు ఏర్పాటు చేశారు. పలు విధానపరమైన నిర్ణయాల విషయంలో సోనియాకు వీరు తగిన సూచనలు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇదీ చూడండి: గోవాకు సోనియా- కొంతకాలం అక్కడే మకాం
ఆర్థిక, విదేశీ, జాతీయ భద్రతా వ్యవహారాలపై ఏర్పాటు చేసిన ఈ 3 కమిటీల్లోనూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సభ్యుడిగా ఉన్నారు.
- ఆర్థిక వ్యవహారాల కమిటీలో మన్మోహన్‌తో పాటు చిదంబరం, మల్లిఖార్జున ఖర్గే, దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్‌కు చోటు. ఈ కమిటీకి కన్వీనర్‌గా జైరాం.
- విదేశీ వ్యవహారాల కమిటీలో ఆనంద్ శర్మ, శశి థరూర్, సల్మాన్ ఖుర్షిద్, సప్తగిరి ఉలక సభ్యులు. ఖుర్షిద్ ఈ కమిటీకి కన్వీనర్.
- విన్సెంట్ పాల కన్వీనర్‌గా ఎంపికైన జాతీయ భద్రతా వ్యవహారాల కమిటీలో మన్మోహన్‌తో పాటు గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, వైతిలింగం సభ్యులు.