ETV Bharat / bharat

నిలకడగా సోనియా గాంధీ ఆరోగ్యం.. సర్​ గంగా రామ్​ ఆస్పత్రి ప్రకటన - సోనియా గాంధీ వైద్య చికిత్స

Sonia Gandhi Illness : కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ క్రమంగా కోలుకుంటున్నారు. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్​తో చేరిన ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని సర్​ గంగా రామ్​ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

sonia gandhi medical treatment
sonia gandhi medical treatment
author img

By

Published : Jan 6, 2023, 4:32 PM IST

Sonia Gandhi Illness : శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్​తో ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్​ అగ్రనేత సోనియా గాంధీ ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని దిల్లీలోని సర్ గంగా రామ్​ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న సోనియా.. బుధవారం గంగా రామ్​ ఆస్పత్రిలో చేరారు.

మంగళవారం నుంచి సోనియా అనారోగ్యంతో ఉన్నట్లు తెలిసింది. అందుకే ఉత్తర్​ప్రదేశ్​లో భారత్​ జోడో యాత్రలో ఏడు కిలోమీటర్లు నడిచాక.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దిల్లీకి తిరిగి వచ్చారని సమాచారం. బుధవారం ప్రియాంక దగ్గరుండి సోనియాను ఆస్పత్రికి తీసుకెళ్లారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

సోనియా గాంధీ గతేడాది రెండుసార్లు కరోనాబారిన పడ్డారు. జూన్‌లో ఓసారి, ఆగస్టులో మరోసారి ఆమెకు కొవిడ్ సోకింది. ఫలితంగా కొవిడ్ అనంతర సమస్యలు తలెత్తాయి. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కు నుంచి రక్తస్రావమైంది. అప్పుడు సైతం సర్ గంగా రామ్ ఆస్పత్రిలోనే చేరారు. శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం చికిత్స తీసుకున్నారు. తొమ్మిది రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి డిశ్చార్జ్ అయ్యారు.

ఇవీ చదవండి: స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

గుడిలో మహిళపై ధర్మకర్త దాడి.. జట్టు పట్టుకుని గెంటివేత.. నల్లగా, వింతగా ఉన్నావంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.