ETV Bharat / bharat

'మహా సర్కార్​ను ప్రశ్నించేందుకే.. ఆ కేసు ఎన్​ఐఏకు'

ముకేశ్​ అంబానీ ఇంటి వద్ద లభ్యమైన పేలుడు పదార్థాల కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించటంపై అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర యంత్రాంగం సరిగా పనిచేయటం లేదని కేంద్రం నిరూపించాలని చూస్తోందని మండిపడ్డారు.

Something fishy: Thackeray on NIA taking over probe
'మహా సర్కార్ పనితీరును ప్రశ్నించేందుకే.. ఆ కేసు ఎన్​ఐఏకు'
author img

By

Published : Mar 9, 2021, 7:59 AM IST

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్​ అంబానీ ఇంటి వద్ద..పేలుడు పదార్థాలతో కూడిన కారు లభ్యమైన కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఛేదించనుంది. అయితే తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం స్పందించారు. పేలుడు పదార్థాలతో కూడిన కారు కేసును ఎన్​ఐఏకు అప్పగించడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

"ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. పాలనా యంత్రాంగంపై విపక్షానికి విశ్వాసం లేదు. రాష్ట్ర యంత్రాంగం పనిచేయటం లేదని విపక్షం వారు నిరూపించాలని భావిస్తున్నారు. అదే నిజమైతే.. ఇంధనంపై పన్ను తగ్గించాలని రాష్ట్రాన్ని వారెలా డిమాండ్ చేస్తున్నారు? కారు యజమాని హిరేన్ మృతి కేసును మా ఉగ్రవాద వ్యతిరేక దళం ఛేదించి తీరుతుంది. లోక్​సభ సభ్యుడు మోహన్ డేల్​కర్​ అనుమానాస్పద ఆత్మహత్యపైనా మా పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఏడుసార్లు దాద్రా నగర్ హవేలీ నుంచి ఎంపీగా ఎన్నికైన వ్యక్తి ముంబయిలో చనిపోతే.. విపక్షం ఎందుకు మౌనంగా ఉంటోంది?"

-- ఉద్ధవ్ ఠాక్రే , మహారాష్ట్ర ముఖ్యమంత్రి

మరోవైపు.. మాన్సుఖ్​ మృతి, పేలుడు పదార్థాలతో కారు లభ్యమైన కేసులను దర్యాప్తు చేయగల సామర్థ్యం ఏటీఎస్​కు ఉందని హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్ శాసన సభలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి : 'అంబానీ ఇంటి వద్ద బాంబు'పై ఎన్​ఐఏ దర్యాప్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.