ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో హిమపాతం.. 4500 వాహనాలకు బ్రేక్!

జమ్ముకశ్మీర్​లో కురుస్తోన్న మంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విపరతమైన మంచు ప్రభావంతో జమ్ము-శ్రీనగర్​, మొఘల్​ రహదారులను మూసివేసినందున.. దాదాపు 4,500 వాహనాలు స్తంభించిపోయాయి. శ్రీనగర్​లోనూ రెండు రోజులుగా విమాన సేవలు నిలిచిపోయినట్టు అధికారులు వెల్లడించారు.

Snowfall leads to closure of jammu srinagar national highway
హిమపాతం.. 4500 వాహనాలకు బ్రేక్!
author img

By

Published : Jan 5, 2021, 5:59 AM IST

జమ్ముకశ్మీర్‌లో మంచు విపరీతంగా కురుస్తోంది. హిమపాతం కారణంగా జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారి, మొఘల్‌ రోడ్డును అధికారులు మూసివేశారు. ఫలితంగా దాదాపు 4,500 పైగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 'హిమపాతం కారణంగా జమ్ము-శ్రీనగర్‌ రహదారిని మూసివేశాం. ప్రధానంగా జవహర్‌ సొరంగ మార్గం ద్వారా రాకపోకలు పూర్తిగా నిలిపివేశాం.' అని ట్రాఫిక్‌ కంట్రోల్‌ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సహాయక చర్యలు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు. మొత్తం 260 కిలోమీటర్ల రహదారి పొడవునా ఎక్కడికక్కడ మంచు తొలగించి రాకపోకలకు మార్గాన్ని సుగమం చేస్తున్నామన్నారు. మరోవైపు జమ్ము నగరాన్ని కశ్మీర్‌లోయను కలుపుతూ నిర్మించిన మొఘల్‌ రోడ్డును గత వారం రోజులుగా అధికారులు మూసివేశారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో అత్యధిక హిమపాతం నమోదైనట్లు వెల్లడించారు. రహదారులపై రెండుమూడు అడుగులమేర మంచుపేరుకుపోయినట్లు చెప్పారు.

పడిపోయిన ఉష్ణోగ్రతలు..

మరోవైపు మంచు ఎక్కువగా కురుస్తుండటం వల్ల శ్రీనగర్‌ నుంచి విమానాల రాకపోకలు కూడా వరుసగా రెండో రోజు నిలిచిపోయాయి. కశ్మీర్‌లోయలోని వివిధ చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీనగర్‌లో తాజాగా 0.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. ఆదివారం రాత్రి -1.5 డిగ్రీలు నమోదైంది. గుల్మార్గ్‌లో గత రెండు రోజులుగా -5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బనిహల్‌-రాంబన్‌, పూంచ్‌, రాజౌరి, కిస్తావర్‌, ద్రాస్‌ తదితర ప్రాంతాల్లోనూ మంచు ఎక్కువగా కురుస్తోందని, మరో రెండుమూడు రోజులు ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇవీ చదవండి: 'ఉగ్రవాదులు కాదు.. ఆ మృతదేహాల్ని అప్పగించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.