ETV Bharat / bharat

భారత్​- బంగ్లాదేశ్​ మధ్య సొరంగాన్నే తవ్వారు! - karimganj district

అసోంలోని కరీంగంజ్ జిల్లాలో బంగ్లాదేశ్​కు దారితీసే సొరంగం బయటపడింది. సరిహద్దు బలగాలకు సమాచారం అందించామని ఎస్పీ మయాంక్ కుమార్ తెలిపారు.

tunnel found in indo bangla border
భారత్​ బంగ్లాదేశ్​ సరిహద్దు వద్ద సోరంగం!
author img

By

Published : Jan 1, 2021, 7:23 PM IST

భారత్​- బంగ్లాదేశ్​ సరిహద్దు ప్రాంతాల్లో ఒకటైన అసోంలోని కరీంగంజ్​ జిల్లాలో పోలీసులు సొరంగాన్ని కనుగొన్నారు. ఓ అపహరణ కేసులో దర్యాప్తు చేపడుతున్న క్రమంలో శుక్రవారం ఈ సొరంగం బయటపడింది. దీనిని చొరబాటుదారులు, నేరస్థులు లేదా పశువుల అక్రమ రవాణా చేసేవారు నిర్మించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

భారత్​ బంగ్లాదేశ్​ సరిహద్దు వద్ద సోరంగం!

''అపహరణకు గురైన ఓ వ్యక్తిని సరిహద్దు అవతలకు తరలించారని ఇటీవలే నీలంబజార్​ ఠాణాలో కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు చేపడుతున్న క్రమంలో ఈ సొరంగం బయటపడింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది కాబట్టి.. ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేం. సరిహద్దు బలగాలకు సమాచారాన్ని అందించాం.''

-మయాంక్​ కుమార్, కరీంగంజ్ జిల్లా ఎస్పీ

కరీంగంజ్​ జిల్లా బంగ్లాదేశ్​తో 92 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటుంది.

ఇదీ చదవండి : '9వ విడత​ చర్చలకు భారత్-చైనా సంప్రదింపులు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.