బంగాల్ ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ అధికారం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు భాజపా ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ. టీఎంసీ అధ్బుత పనితీరు వెనక ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పాత్ర కీలమని కొనియాడారు. అయితే బంగాల్లో భాజపా ప్రదర్శనపై ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
ఆధిక్యం తుది ఫలితానికి నిజమైన సూచన కాదని.. తమ పార్టీ ఎన్నికలలో విజయం సాధిస్తుందని ఆదివారం ఉదయం విశ్వాసం వ్యక్తం చేశారు విజయవర్గీయా. అయితే ఓట్ల లెక్కింపులో భాజపా నేతలు బాబుల్ సుప్రియో, లాకెట్ ఛటర్జీ వెనుకంజలో ఉండటంపై ఆశ్చర్యం కలిగిందన్నారు. పార్టీ పేలవమైన ప్రదర్శనపై కేంద్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారని పేర్కొన్నారు.
"మమతా బెనర్జీ వల్లే టీఎంసీ విజయం దిశగా దూసుకుపోతుంది. ప్రజలు.. దీదీని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. మేం ఎక్కడ తప్పు చేశామో ఆత్మపరిశీలన చేసుకోవాలి."
- కైలాశ్ విజయవర్గీయ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి
ప్రస్తుతం బంగాల్లో టీఎంసీ విజయం దిశగా దూసుకుపోతుంది. 70కుపైగా స్థానాల్లో భాజపా ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఇదీ చూడండి: ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకున్న పీకే