మధ్యప్రదేశ్ ఖాల్వా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వివాహ వేడుక కోసం ఊరేగింపుగా వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో పెళ్లి కొడుకు సహా ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 15-20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు.
![six-wedding-processions-including-groom-die-in-road-accident-in-khandwa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mp-kha-01-6death-pkg-7203889_03122020164633_0312f_1606994193_424.jpg)
ఖాల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహ్లు గ్రామంలో మధ్యాహ్నం మూడు గంటలకు ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ అదుపుతప్పడం వల్ల ట్రాక్టర్ బోల్తా పడినట్లు తెలుస్తోంది.
![processions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9752543_khandwanew-2.jpg)
![processions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9752543_khandwanew-3.jpg)