ETV Bharat / bharat

నార్మల్ చీరతో డిజైనర్ లుక్ - ఈ టిప్స్​ పాటిస్తే మెరిసిపోతారంతే!

Simple ways to Make Plain Sarees Beautiful : ఆడవాళ్ల అసలైన అందం కనిపించేది చీరలోనే! శారీకున్న కెపాసిటీ అది! ఆ బ్యూటీని మరింతగా మెరిపించేందుకు ఫ్యాన్సీ నుంచి డిజైనర్​ దాకా.. సిల్క్ నుంచి పట్టు దాకా.. రకరకాల శారీస్ ట్రై చేస్తుంటారు మహిళామణులు. అయితే.. ఖరీదైన చీరలు కట్టడం అందరికీ సాధ్యం కాదు. ఇలాంటి వారికోసమే ఈ టిప్స్! నార్మల్ చీరను కూడా డిజైనర్​ శారీ లుక్స్​తో అదుర్సు అనిపించొచ్చు. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం.

saree tips
Simple ways to Make Plain Sarees Beautiful
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2023, 3:30 PM IST

Best Tips for wear Normal Saree As Looking Style : చీర అందరూ కడతారు. కానీ.. దానికి సరైన లుక్ తేవడం ఎలా అన్నది మాత్రం అందరికీ తెలియదు. అందుకే.. మీకోసం కొన్ని టిప్స్ తెచ్చాం. ఈ టిప్స్(Fashion Tips) తెలిస్తే.. సాధారణ చీరకు సైతం డిజైనర్​ లుక్ తేవొచ్చు. మీకు మీరే ఫ్యాషన్​ డిజైనర్లుగా మారిపోవచ్చు. మరి.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

కలర్ : ఒక చీర మీకు అందాన్ని తేవాలంటే.. కావాల్సింది ఆ చీర కాస్ట్​లీగా ఉండడం కాదు! మీ మేని ఛాయకు తగ్గట్టుగా ఉండడం. అది నార్మల్ శారీ అయినా సరే.. మీకు సరిపడే రంగును ఎంచుకోవాలి. చీర కట్టుకోవడంలో ఇది మొదటిది, ముఖ్యమైనది.

ప్రింట్స్ : మీరు సెలక్ట్ చేసుకునే చీర ప్రింట్స్‌ చక్కగా ఉండాలి. మీరు లైట్ కలర్ చీర ఎంచుకుంటే.. ప్రింట్స్ మరింత చక్కగా కనిపించాలి. లేకపోతే.. మంచి డార్క్ కలర్స్​తో ఉండే చీరను తీసుకున్నా సరిపోతుంది.

మ్యాచింగ్ బ్లౌజ్ : అలాగే శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకోవాలి. అప్పుడే మీ చీరకు మంచి లుక్ వస్తుంది. ఫుల్ స్లీవ్స్ అయినా.. స్లీవ్‌లెస్ అయినా.. ఈ రెండిట్లో మీకు నచ్చిన జాకెట్ మోడల్ ఎంచుకోవచ్చు.

కాంట్రాస్ట్ బ్లౌజ్: నార్మల్ చీరను హైలెట్ చేయడంలో.. కాంట్రాస్ట్ బ్లౌజ్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. గతంలో కంటే.. ఇప్పుడు కాంట్రాస్ట్ బ్లౌజ్​ల ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. పూర్తి ప్లెయిన్, వర్క్‌తో కూడిన కాంట్రాస్ట్​ బ్లౌజ్‌తో శారీకి మ్యాచ్ చేస్తే.. మీ లుక్ మొత్తం మారిపోతుంది.

ట్రెండీగా కనిపించాలని అనుకుంటున్నారా.. ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!

స్టైల్ మార్చండి : చీరను ఎప్పుడూ ఒకేలా చుట్టడం కాదు.. అప్పుడప్పుడూ డిఫరెంట్‌గా కట్టడం కూడా ట్రై చేయాలి. చీర కట్టడంలో ఎన్నో రకాలు ఉన్నాయి. యూట్యూబ్​లో సెర్చ్ చేసినా.. ఇంటర్నెట్​లో వెదికినా.. చీర కట్టడంలో చాలా రకాలు మీకు కనిపిస్తాయి. వాటిని ట్రై చేయొచ్చు.

జ్యువెలరీ : ఇక చివరగా మీరు ఎంచుకునే జ్యువెలరీ కూడా ముఖ్యం. దీనికోసం మీరు స్టేట్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ వంటివి సెట్ చేసుకోవాలి. అయితే.. జ్యువెలరీని ఎక్కువగా కాకుండా.. లైట్​గా ధరిస్తేనే బాగుంటుంది. పైన చెప్పిన మార్పులన్నీ పాటించారంటే.. ​మీరు ధరించింది నార్మల్ చీర అన్న సంగతే మరిచిపోతారు చూసేవారు!

కాన్ఫిడెంట్​గా ఉండాలి : మీరు ఎలాంటి చీర ధరించారు..? ఎలాంటి నగలు పెట్టుకున్నారు? అనే విషయం ఒకెత్తయితే.. వాటిని ప్రదర్శించడం కూడా మరో ఎత్తు. మీరు చీరకట్టిన తర్వాత కంఫర్ట్​గా ఫీలవ్వాలి. ఇబ్బంది పడకూడదు. ఇంకా.. కాన్ఫిడెంట్​గా ఉండాలి. ఎవరు ఏమనుకుంటారో అనే ఫీలింగ్​ అస్సలే ఉండొద్దు. ఇలాంటి ఆలోచనలు మీ మనసులో ఉంటే.. ఆ బెరుకు మీ ముఖంలో కనిపిస్తుంది. దాంతో.. మీ లుక్​లో పర్ఫెక్షన్ దెబ్బ తింటుంది. ఈ సూచనలు పాటిస్తే.. నార్మల్ శారీ కూడా సూపర్బ్​గా కనిపించదూ..! ఓ సారి ట్రై చేయండి.

Krithi Shetty Saree Photos : చీరలో కృతిశెట్టి సోకుల విందు.. అందం ఓవర్​లోడెడ్​!

మీ ఫేస్​ కట్​కు - ఎలాంటి బొట్టు బాగుంటుందో తెలియట్లేదా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.