ETV Bharat / bharat

పెళ్లిలో రాయల్ లుక్​.. వధూవరులకు 'వెండి' చెప్పులు.. ధరెంతో తెలుసా? - ఉత్తర్​ప్రదేశ్​ వార్తలు

Silver Sandals For Wedding : పెళ్లిళ్ల సీజన్‌ సమీపిస్తుండటం వల్ల ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో ఓ నగల యజమాని వినూత్నంగా ఆలోచించారు. వరుడు, వధువుల కోసం పాదరక్షలను వెండితో రూపొందించారు. పెళ్లిలో వారు ధరించే నగలే కాకుండా పాదరక్షలు తలతలలాడేలా చేస్తున్నారు. 100 నుంచి 500 గ్రాములు ఉండే ఈ చెప్పులు 25 వేలకు విక్రయిస్తున్నారు. వినియోగదారులు సైతం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వాటిని కొనుగోలు చేస్తున్నారు.

Silver Sandals For Wedding
Silver Sandals For Wedding
author img

By

Published : Jul 24, 2023, 8:20 AM IST

నూతన వధూవరులకు వెండి పాదరక్షలు!

Silver Sandals For Wedding : ఉత్తర్‌ప్రదేశ్‌ లఖ్‌నవూలో ఓ నగల దుకాణ యజమాని వెండితో పాదరక్షలను తయారు చేస్తున్నారు. అంతేకాకుండా వాటి మీద రత్నాలు, ముత్యాలను పొదిగి మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. 100 నుంచి 500 గ్రాములు ఉండే ఈ పాదరక్షలను 25 వేలకు విక్రయిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కానుండటం వల్ల దుకాణ యజమాని వధూవరుల కోసం ఇలా ప్రత్యేకంగా పాదరక్షలను తయారు చేస్తున్నారు.

సిల్వర్​ పాదరక్షలు ధరిస్తే రాయల్​ ఫీలింగ్​
Silver Wedding Chappals : అయితే వినియోగదారుల నుంచి స్పందన కూడా ఆశించిన రీతిలో ఉండటం వల్ల వరుడికి కావాల్సిన మిగతా వస్తువులను వెండితో రూపొందిస్తున్నారు. పిల్లల కోసం ప్రత్యేక ఆకృతిలో తయారు చేస్తామని యజమాని వినోద్ మహేశ్వరి తెలిపారు. పాదరక్షలను ధరిస్తే రాయల్‌ ఫీలింగ్ కలుగుతోందని వినియోగదారులు తమ అనుభూతిని వ‌్యక్తపరుస్తున్నారు.

నూతన వధూవరులకు వెండి పాదరక్షలు!
నూతన వధూవరులకు వెండి పాదరక్షలు!

వరుడు ధరించే బెల్ట్​లు కూడా
కేవలం పాదరక్షలనే కాకుండా వరుడు ధరించే బెల్ట్‌లను వెండితో రూపొందిస్తున్నారు. బరువు, డిజైన్‌ ఆధారంగా దీని ధరను 20 వేలుగా నిర్ణయించారు. వరుడి కుటుంబ సభ్యులకు కావాల్సిన ఇతర వస్తువులను వెండితోనే తయారు చేస్తున్నారు. వినియోగదారులు సైతం ఆసక్తి కనబరుస్తుండటంతో మరిన్ని నూతన ఉత్పత్తులను తీసుకొస్తామని యజమాని వినోద్ మహేశ్వరి తెలిపారు.

నూతన వధూవరులకు వెండి పాదరక్షలు!
వరుడికి వెండి బెల్ట్

పెళ్లికి గెస్ట్​లుగా ఎద్దులు..
నిరంతరం పొలంలో పనిచేస్తూ జీవనాధారంగా ఉన్న ఎద్దులపై వినూత్నంగా ప్రేమను చూపాడు ఓ వ్యక్తి. తన పెళ్లికి వాటిని అతిథులుగా తీసుకువచ్చాడు. అంతే కాకుండా వాటి కోసం ప్రత్యేకంగా ఓ స్టేజీని ఏర్పాటు చేశాడు. ఈ పెళ్లిలో ఎద్దులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది.

చామరాజనగర్ జిల్లా నంజన్‌గూడు తాలూకా చిక్కహోమ్మా గ్రామానికి చెందిన మహేష్.. వృత్తి రీత్యా రైతు. అతడికి యోగిత అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. సోమవారం జరిగిన ఈ వేడుకకు తనకు వ్యవసాయంలో ఎంతో సాయం చేసిన రెండు ఎద్దులను ఫంక్షన్ హాల్​ వద్దకు తీసుకువచ్చాడు. వాటి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాడు. వాటిని ఆకర్షనీయంగా ముస్తాబు చేశాడు. "మా అబ్బాయికి ఈ ఎద్దులంటే చాలా ఇష్టం. వీటి ధర రూ. రెండు లక్షల దాకా ఉంటుంది." అని వరుడి తండ్రి బసవరాజప్ప తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోలు చూడాలంటే ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.