Sikkim Flood : సిక్కింలో ఆకస్మిక వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదల్లో 14 మంది మృతిచెందగా.. మరో 26 మంది గాయపడ్డారు. 22 మంది జవాన్లు సహా 102 మంది గల్లంతయ్యారు. ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. వాగులు, వంకలు, సరస్సులు పోటెత్తాయి. దీంతో లాంచెన్ లోయలోని తీస్తా నదిలో.. వరద ప్రవాహం ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి చేరింది. ఫలితంగా సమీపంలోని చుంగ్ తాంగ్ డ్యాంలోకి వరద ప్రవాహం పెరగ్గా.. నీటిని దిగువకు విడుదల చేశారు.
లోతట్టు ప్రాంతాలు వరద గుప్పిట చిక్కాయి. వరద ఉద్ధృతికి సింగ్ తామ్ సమీపంలోని.. బర్దంగ్ ప్రాంతంలో సైనిక శిబిరాలు కొట్టుకుపోయినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. పార్కింగ్‌లో ఉంచిన 41 సైనిక వాహనాలు మునిగిపోయాయి. బుధవారం ఉదయం 23 మంది సైనికులు గల్లంతయ్యారు. రెస్య్కూ చేపట్టిన సహాయక బృందాలు.. ఓ సైనికుడు సహా 166 మందిని రక్షించాయి. ప్రస్తుతం సైనికుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని.. మిగతా వారి కోసం ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు డిఫెన్స్ అధికారి తెలిపారు.
చుంగ్ తాంగ్ డ్యాం నుంచి.. ముందస్తు సమాచారం లేకుండా నీటిని విడుదల చేయటమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు చెప్పారు. గ్యాంగ్‌టక్ జిల్లాలో తీస్తా నది వరద ఉద్ధృతికి సింగ్తమ్ ఫూట్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. సిక్కిం సీఎం PS తమంగ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. సిక్కింలోని పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం తమంగ్‌తో ఫోన్లో మాట్లాడారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలో అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చారు.
-
14 people dead, 102 missing and 26 injured in the flash floods in Sikkim: Govt of Sikkim
— ANI (@ANI) October 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">14 people dead, 102 missing and 26 injured in the flash floods in Sikkim: Govt of Sikkim
— ANI (@ANI) October 5, 202314 people dead, 102 missing and 26 injured in the flash floods in Sikkim: Govt of Sikkim
— ANI (@ANI) October 5, 2023
సిక్కిం నుంచి బంగాల్‌కు వరద.. తీస్తా నది ప్రవాహం ఉత్తర బంగాల్‌ను తాకింది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా.. తొమ్మిది జిల్లాల్లో 190 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, 10 వేల మందిని సురక్షితంగా తరలించినట్టు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. అయితే కాలి గాయం కారణంగా.. సీఎం ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితిని చక్కబెట్టేందుకు.. పలు శాఖల్లోని ప్రభుత్వ అధికారుల సెలవులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. బంగాల్ గవర్నర్ CV ఆనంద్ బోస్.. గురువారం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు.
ఒకే కుటుంబంలో మూడు తరాలు బలి.. తమ్ముడిని కాపాడబోయి అన్న కూడా.. కొండచరియల వల్ల మొత్తం 60 మంది మృతి