ETV Bharat / bharat

రెస్టారెంట్​లో ఎస్సై దౌర్జన్యం- బదిలీ వేటు - SI beating up the staff and customers of a restaurant

రెస్టారెంట్​లో దౌర్జన్యానికి పాల్పడిన ఓ ఎస్సైపై బదిలీ వేటు పడింది. రెస్టారెంట్​లోకి వచ్చి కస్టమర్లను కొడుతున్న వీడియో అధికారుల దృష్టికి చేరింది. దీంతో ఎస్సైపై చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు.

si beating up staff of a restaurent
తమిళనాడు రెస్టారెంట్​లో ఎస్సై దౌర్జన్యం
author img

By

Published : Apr 12, 2021, 7:21 PM IST

రెస్టారెంట్​లోకి ప్రవేశించి.. సిబ్బందిని, కస్టమర్లను కొట్టిన సబ్​ ఇన్​స్పెక్టర్​ను అధికారులు బదిలీ చేశారు. ఎస్సై దౌర్జన్యం తాలూకు దృశ్యాలు వైరల్ కావడం వల్ల ఈ చర్యలు తీసుకున్నారు.

ఏం జరిగిందంటే?

తమిళనాడు కోయంబత్తూర్​లోని కట్టూర్ పోలీస్ స్టేషన్​కు చెందిన ఎస్సై.. ఆదివారం రాత్రి 10.20 గంటలకు ఓ రెస్టారెంట్​లోకి వెళ్లాడు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న నెపంతో అక్కడి కస్టమర్లు, సిబ్బందిని లాఠీతో కొట్టాడు. ఆ సమయంలో హోటల్​లో ఉన్న ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.

రెస్టారెంట్ సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు

లంచం కోసం!

దీనిపై రెస్టారెంట్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఎస్సై ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వచ్చి రెస్టారెంట్ మూసేయాలని చెబుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాత్రి 11 గంటల వరకు రెస్టారెంట్ కార్యకలాపాలు కొనసాగొచ్చని చెప్పారు. ఎస్సై కొన్నిసార్లు లంచం డిమాండ్ చేశాడని వివరించారు. రెస్టారెంట్​లో భోజనం చేసి డబ్బులు కూడా చెల్లించలేదని చెప్పారు. డబ్బులు అడిగితే బెదిరించేవాడని అన్నారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తునకు ఆదేశించారు దేవసిర్వతం పోలీస్ కమిషనర్ డేవిడ్​సన్. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సైని పోలీస్ కంట్రోల్​ రూంకు బదిలీ చేశారు.

మరోవైపు, ఈ ఘటనపై రెండు వారాల్లోగా నివేదిక అందించాలని తమిళనాడు రాష్ట్ర మానవహక్కుల సంఘం సీపీని ఆదేశించింది.

ఇదీ చదవండి: వచ్చే ఐదు రోజులు వర్షాలే వర్షాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.