ETV Bharat / bharat

'నీ మాల్​ను అంబానీకి అమ్మేయ్.. లేదంటే చంపేస్తాం' - మెట్రో మాల్ అమ్మకం బెంగళూరు

బెంగళూరులో మెట్రో షాపింగ్ మాల్​కు బెదిరింపు లేఖ వచ్చింది. షాపింగ్ మాల్​ను అంబానీకి అమ్మాలని లేఖలో దుండగులు పేర్కొన్నారు. లేదంటే చంపేస్తామని హెచ్చరించారు.

Metro mall selling ambani
Metro mall selling ambani
author img

By

Published : Jun 20, 2022, 8:34 PM IST

Metro mall selling threatening letter: 'నీ షాపింగ్ మాల్​ను వెంటనే అంబానీకి అమ్మేయాలి. లేదంటే చంపేస్తాం' అంటూ బెంగళూరులోని మెట్రో షాపింగ్ మాల్​కు బెదిరింపు లేఖ వచ్చింది. తమిళ భాషలో ఈ లేఖ ఉంది. దీనిపై సుబ్రహ్మణ్య పోలీస్ స్టేషన్​లో యాజమాన్యం ఫిర్యాదు చేసింది.

'మెట్రో' షాపింగ్ మాల్​ను హెచ్​సీఎల్ కంపెనీకి విక్రయించేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపైనే బెదిరింపు లేఖ వచ్చింది. షాపింగ్ మాల్​ను రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి విక్రయించాలని దుండగులు బెదిరించారు. లేదంటే టాటా, విప్రో కంపెనీలకు అమ్మాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే మెట్రో ఎండీ, సీఈఓ అరవింద్ మెదిరట్టను హత్య చేస్తామని బెదిరించారు. జర్మనీకి చెందిన మెట్రో ఏజీ హోల్​సెల్లర్ కంపెనీ... మెట్రో క్యాష్ అండ్ క్యారీ పేరుతో భారత్​లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దిల్లీకి చెందిన అరవింద్.. భారత కార్యకలాపాలకు ఎండీ, సీఈఓగా వ్యవహరిస్తున్నారు.

metro Shopping Mall md
అరవింద్ మెదిరట్ట

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.