Shopian encounter: జమ్ముకశ్మీర్‌లో తాజాగా మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇక్కడి షోపియాన్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారనే పక్కా సమాచారం మేరకు భద్రతా సిబ్బంది.. జిల్లాలోని కిల్బల్ గ్రామంలో ఆపరేషన్ ప్రారంభించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. కొత్త ఏడాదిలో భద్రతా బలగాలు ఉగ్రవాదులపై దాడులను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. 22 రోజుల్లో దాదాపు పదికి పైగా ఎన్‌కౌంటర్‌లలో 17 మంది ఉగ్రవాదులను హతమార్చాయి.
-
#ShopianEncounterUpdate: 01 more #terrorist killed (Total 02, both local terrorists of #terror outfit LeT/TRF). #Incriminating materials including arms and ammunition recovered. Search going on.Further details shall follow. @JmuKmrPolice https://t.co/u9UtwO78ml
— Kashmir Zone Police (@KashmirPolice) January 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#ShopianEncounterUpdate: 01 more #terrorist killed (Total 02, both local terrorists of #terror outfit LeT/TRF). #Incriminating materials including arms and ammunition recovered. Search going on.Further details shall follow. @JmuKmrPolice https://t.co/u9UtwO78ml
— Kashmir Zone Police (@KashmirPolice) January 22, 2022#ShopianEncounterUpdate: 01 more #terrorist killed (Total 02, both local terrorists of #terror outfit LeT/TRF). #Incriminating materials including arms and ammunition recovered. Search going on.Further details shall follow. @JmuKmrPolice https://t.co/u9UtwO78ml
— Kashmir Zone Police (@KashmirPolice) January 22, 2022
మానవ మేధస్సు(హ్యూమన్ ఇంటెలిజెన్స్) ఆధారంగా ఉగ్రవాదులపై దాడులు జరుపుతుండటంతో ఎన్‌కౌంటర్‌ల సమయంలో నష్టనివారణ సాధ్యమవుతున్నట్లు భద్రతా బలగాలు.. తమ కోర్ గ్రూప్ సమావేశం దృష్టికి తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే గత ఏడాది కశ్మీర్‌లో తీవ్రవాద కార్యకలాపాలు తగ్గినట్లు చెప్పాయి. మరోవైపు భారత్, పాక్ సైన్యాల మధ్య నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంబడి సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులు మెరుగుపడినట్లు కోర్ గ్రూప్ ఉన్నతాధికారులు తెలిపారు. పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లూ తగ్గినట్లు వెల్లడించారు. అయితే, ఎల్‌ఓసీ వెంబడి ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయన్న ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో.. అప్రమత్తంగా ఉండాలని భద్రతా బలగాలకు సూచించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: సినిమాను తలపించేలా మాఫియా గ్రూప్‌ల గన్ ఫైట్.. ఇద్దరు మృతి