కొద్ది రోజులుగా మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా ముంబయిలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అయితే.. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే.. మురికినీరు రోడ్లపై నిలిచిందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో.. చాందీవలీ శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే అత్యుత్సాహం ప్రదర్శించారు. తమ ప్రాంతంలోని పారిశుద్ధ్య కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోడ్డుపై ప్రవహిస్తున్న మురికినీరులో కాంట్రాక్టర్‌ను కూర్చోపెట్టి.. పారిశుద్ధ్య సిబ్బందితో ఆయనపై చెత్తను వేయించారు ఎమ్మెల్యే. కాంట్రాక్టర్ తన విధులను సక్రమంగా నిర్వర్తించనందువల్లే ఇలా కఠినంగా ప్రవర్తించాల్సి వచ్చిందని చెప్పారు. అయితే.. ఎమ్మెల్యే ప్రవర్తన వివాదాస్పదంగా మారింది.
ఇదీ చదవండి:బాత్రూమ్లో కొండ చిలువ.. గుండెలు హడల్!