ETV Bharat / bharat

నేటి నుంచే షిరిడీ సాయి దర్శనం.. నిబంధనలివే

author img

By

Published : Nov 16, 2020, 3:11 PM IST

ప్రఖ్యాత షిరిడీ సాయిబాబా దేవాలయం దాదాపు ఏడు నెలల తరువాత ఇవాళ తెరుచుకోనుంది. కొవిడ్​-19దృష్ట్యా భక్తులకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.

Shirdi Sai Temple opening from today these are the rules
నేటి నుంచే షిరిడీ సాయి దర్శనం.. నిబంధనలివే

మహారాష్ట్రలో అత్యంత రద్దీగా ఉండే పుణ్యక్షేత్రాల్లో షిరిడీ సాయిబాబా దేవాలయం ఒకటి. లాక్​డౌన్​ కారణంగా మార్చి 17న మూసివేసిన ఆలయం దాదాపు 7నెలల తరువాత ఇవాళ తెరుచుకోనుంది. ఈ ఆలయంలో కఠిన నియమ నిబంధనలు అమలులో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేసింది.

* పది సంవత్సరాలలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వారికి షిరిడీలో దర్శనానికి అనుమతి లేదు.

* దర్శనం కోసం స్థానికులకు టోకెన్లు ఇస్తారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఆన్‌లైన్‌లో పాస్‌ తీసుకోవాలి. వారికి కేటాయించిన టైమ్‌ స్లాట్‌లో మాత్రమే దర్శనానికి రావాల్సి ఉంటుంది.

* తమకు కొవిడ్‌ లేదని తెలిపే ధ్రువీకరణ పత్రాన్ని ప్రతి ఒక్కరు గేటు వద్దనే చూపాలి.

* బాబా సమాధి, ద్వారకా మయి ఆలయాల దర్శనానికి భక్తులకు అనుమతి లేదు.

* భక్తులు చెప్పులను లేకుండా ఆలయంలోకి ప్రవేశించాలి.

* భక్తులు స్వయంగా ప్రసాదాలను నివేదించడం, తీర్థాన్ని జల్లటం వంటి వాటికి అనుమతి లేదు.

* ఆలయ పరిసరాలు, క్యూలలో మాస్కులను ధరించటం, సామాజిక దూరం తప్పనిసరి.

* కాళ్లు కడుక్కోవటం, ఉష్ణోగ్రత కొలిచేందుకు, శానిటైజేషన్‌ ఏర్పాట్లు దర్శనం క్యూలోనే ఉంటాయి.

* ఆలయంలోని విగ్రహాలు, పవిత్ర గ్రంథాలను చేతితో తాకకూడదు.

* ఆలయ ప్రాంగణంలో భక్తులు గుంపులుగా కూడేందుకు అనుమతి లేదు.

భక్తుల సంక్షేమం కోసమే తాము ఈ నియమ నిబంధనలు ఏర్పాటుచేశామని.. ఇందుకు అందరూ సహకరించాలని శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్టు ముఖ్య కార్యనిర్వహణాధికారి కన్హురాజ్‌ బగాతే కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.