ETV Bharat / bharat

'అహంకారపు కుర్చీ దిగి రైతులకు న్యాయం చేయండి'

అహంకారం అనే కుర్చీ దిగివచ్చి రైతులకు హక్కులు కల్పించటంపై ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. దిల్లీలో రైతుల ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్న క్రమంలో ట్విట్టర్​ వేదికగా విమర్శలు గుప్పించారు.

Rahul gandhi
రాహుల్​ గాంధీ
author img

By

Published : Dec 1, 2020, 12:42 PM IST

దేశ రాజధాని దిల్లీలో రైతులు నిరసనలు చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. కేంద్ర ప్రభుత్వం మేల్కొని, అహంకారం అనే కుర్చీ నుంచి దిగివచ్చి ఆందోళనలు చేస్తున్న రైతులకు హక్కులు కల్పించాలన్నారు. రైతులకు ప్రతి ఒక్కరు రుణపడి ఉన్నారని, వారికి న్యాయం చేసినప్పుడే ఆ రుణం తీర్చుకున్నవారమవుతారని పేర్కొన్నారు.

  • अन्नदाता सड़कों-मैदानों में धरना दे रहे हैं,
    और
    ‘झूठ’ टीवी पर भाषण!

    किसान की मेहनत का हम सब पर क़र्ज़ है।

    ये क़र्ज़ उन्हें न्याय और हक़ देकर ही उतरेगा, न कि उन्हें दुत्कार कर, लाठियाँ मारकर और आंसू गैस चलाकर।

    जागिए, अहंकार की कुर्सी से उतरकर सोचिए और किसान का अधिकार दीजिए।

    — Rahul Gandhi (@RahulGandhi) December 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" రోడ్లపై బైఠాయించి రైతులు ఆందోళనలు చేస్తున్నారు. నేతలు టీవీల్లో ప్రసంగాలు ఇస్తున్నారు. రైతుల కష్టానికి మనమంతా రుణపడి ఉన్నాం. వారికి న్యాయం, హక్కులు ఇచ్చినప్పుడే మన రుణం తీరుతుంది. కానీ, వారి పట్ల తప్పుగా ప్రవర్తించటం, లాఠీ ఛార్జ్​ చేయటం, బాష్పవాయువు ప్రయోగించటం వల్ల కాదు. మెల్కొనండి, అహంకారం అనే కుర్చీ నుంచి దిగి వచ్చి రైతులకు వారి హక్కులు కల్పించటంపై ఆలోచించండి."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

కేంద్ర తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. పంజాబ్​, హరియాణాల నుంచి పెద్ద ఎత్తున రైతులు దేశరాజధానికి చేరుకుని సింఘు, టిక్రీ, ఘజిపుర్​ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు చర్చలకు రావాలని కోరింది కేంద్రం.

ఇదీ చూడండి: చర్చకు కేంద్రం రెడీ- మరి రైతులు భేటీకి వస్తారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.