ETV Bharat / bharat

'డీఎంకే మహిళా వ్యతిరేక పార్టీ- గుణపాఠం చెప్పండి' - ఎన్నికల ప్రచారం

తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. డీఎంకే పార్టీ.. మహిళల పట్ల అమర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. సీఎం పళనిస్వామిపై డీఎంకే నేత ఎ.రాజా వ్యాఖ్యలను ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్​డీఏ కూటమిని గెలిపించాలని కోరారు.

Shah tears into DMK for A Raja's offensive remarks against TN CM; dubs it "anti-women"
డీఎంకే మహిళా వ్యతిరేక పార్టీ- ఆ మాటలే నిదర్శనం: షా
author img

By

Published : Apr 1, 2021, 2:14 PM IST

ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. డీఎంకే నేత ఎ.రాజా.. తమిళనాడు ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా పార్టీ పట్టించుకోలేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను బట్టి.. ఆ పార్టీ మహిళలకు వ్యతిరేకమని అర్థం అవుతుందని అన్నారు. తమిళనాడులోని తిరుకోయులూర్​లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు హోం మంత్రి.

గతంలో దివంగత సీఎం జయలలితపై ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలే చేశారని, ఏప్రిల్​ 6న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు తల్లులు, సోదరీమణులు.. 'డీఎంకే'కు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు అమిత్ షా. ఏం చేసైనా డీఎంకే ఈ సారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు.

''డీఎంకే నేత ఎ.రాజా చేసిన ప్రకటన నేను చూశాను. మరణించిన మహిళపై ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. నాకు తెలిసి డీఎంకేకు మహిళల పట్ల గౌరవం, మర్యాద ఏమాత్రం లేవు. ఎలాగైనా, ఏం చేసైనా ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది.''

- అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి.

అభివృద్ధి మార్గంలో నడుస్తున్న ఎన్​డీఏ, అవినీతి, వారసత్వ రాజకీయాల్లో ఇరుక్కుపోయిన యూపీఏ మధ్యే ఈ ఎన్నికల సంగ్రామం జరుగుతోందని అన్నారు షా.

రాజా ఏమన్నారంటే..

రాజా ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ.. అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చిన పళనిస్వామి అకాల శిశువుగా జన్మించారంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం చెలరేగింది. రాజా వ్యాఖ్యలతో సీఎం కంటతడి పెట్టారు. ఆ తర్వాత రాజా క్షమాపణలు చెప్పారు.

పుదుచ్చేరికి రెండోసారి..

అంతకుముందు పుదుచ్చేరిలో రోడ్​షా నిర్వహించారు షా. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎన్నికల కోసం షా.. ఇక్కడ పర్యటించడం ఇది రెండోసారి.

ఈ కేంద్రపాలిత ప్రాంతంలో భాజపా 9 స్థానాల్లో పోటీచేస్తోంది. ఎన్​డీఏలోని తన మిత్రపక్షం ఏఐఎన్​ఆర్​సీ 16 స్థానాల్లో బరిలోకి దిగుతోంది.

ఇదీ చదవండి: 'తల్లిని దూషించడం తప్పే.. క్షమించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.