దేశ రాజధాని దిల్లీలో వలసకార్మికులను లాక్డౌన్ కష్టాలు వెంటాడుతున్నాయి. కరోనా కట్టడికి విధించిన ఆంక్షలను కేజ్రీ సర్కారు పదేపదే పొడగిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు దిల్లీలోనే ఉన్న వలసకూలీలు స్వగ్రామాల బాట పడుతున్నారు.


కంపెనీలు మూసివేయడం, ఇతర పనులేవీ దొరకపోవడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సొంత రాష్ట్రానికి పయనమవుతున్నట్టు చెబుతున్నారు. దీంతో దిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ వలసకూలీలతో కిక్కిరిసిపోయింది.
"ఇక్కడ పని ఆగిపోయింది. మేం పేదవాళ్లం. మా అమ్మ పరిస్థితి విషమంగా ఉంది. తిండికి ఇబ్బందులు ఉన్నాయి. కంపెనీలు మూసేశారు. ఇక్కడే ఎన్నిరోజులు ఆకలితో ఉండాలి. అందుకే ఇంటికి వెళ్లిపోతున్నాం."
-రామ్‌జీ, వలసకూలీ
"యజమానికి కిరాయి కావాలి. అతనికి డబ్బులు ఎలాగైనా కావాలి. చివరకు సమస్యలన్నీ కూలీలకే. పోలీసులు మాపైనే దౌర్జన్యం చేస్తారు. ధనవంతులను ఏం చేయరు. సమస్య ఇది."
-వలసకూలీ

స్వస్థలాలకు వెళ్లే బస్సుల కోసం మహిళలు, చిన్నారులు సైతం గంటల పాటు పడిగాపులు కాస్తున్నారు. రోడ్లపైనే తింటున్నారు. ఫుట్‌పాత్‌లపైనే నిద్రిస్తున్నారు. కూలీ చేస్తేనే రోజు గడవని ఆ ఆభాగ్యుల దుస్థితి తీవ్రంగా కలచివేస్తోంది.
ఇదీ చదవండి: కరోనాను జయించిన వందేళ్ల బామ్మ