ETV Bharat / bharat

మళ్లీ జికా వైరస్​ కలకలం.. ఏడేళ్ల బాలికకు పాజిటివ్​

Zika Virus: దేశంలో తాజాగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో జికా వైరస్ కేసు వెలుగు చూసింది. మహారాష్ట్రకు చెందిన ఓ ఏడేళ్ల బాలిక.. జికా వైరస్​ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Zika Virus:
Zika Virus:
author img

By

Published : Jul 13, 2022, 7:13 PM IST

Updated : Jul 13, 2022, 7:37 PM IST

Zika Virus: దేశంలో మరోసారి జికా వైరస్​ కేసు వెలుగుచూసింది. మహారాష్ట్రలోని పాల్​ఘర్​ జిల్లాకు చెందిన ఓ ఏడేళ్ల బాలికకు జికా వైరస్​ పాజిటివ్​గా తేలినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని తలసరి గ్రామంలో ఉన్న గిరిజన రెసిడెన్షియల్​ పాఠశాలలో ఆమె చదువుకుంటోందని చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా జికా వైరస్ కేసు గతేడాది జులైలో పుణెలో నమోదైందని పేర్కొన్నారు.

ఏంటీ వైరస్​?.. జికా వైరస్‌ ఏడెస్‌ అనే దోమ నుంచి మనుషులకు సోకుతుంది. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ.. ఇప్పటి వరకూ దీనికి మందు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఈ వైరస్‌ సోకితే కొందరిలో జ్వరం, దద్దర్లు, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలకు సోకితే వారి ఎదుగుదలపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొలుత 1947లో ఉగాండా అడవుల్లో కోతుల్లో ఈ వైరస్ కనిపించింది. 1952లో మనుషుల్లోనూ గుర్తించారు. 2017లో అహ్మదాబాద్‌, తమిళనాడులో ఈ కేసులు వెలుగుచూశాయి.

కరోనా కంటే ప్రమాదకరమా..? కరోనా వైరస్​ తీవ్రత తగ్గిందని ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో.. ఇటీవలే మహమ్మారి మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పుడు మహారాష్ట్రలో జికా వైరస్​ కేసు వెలుగు చూడడం.. ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే అసలు ఈ జికా వైరస్​ కరోనాతో పోల్చుకుంటే ఎంత ప్రమాదకరం?.. ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇదీ చదవండి: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. 45మంది మృతి

Last Updated : Jul 13, 2022, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.