ETV Bharat / bharat

షిర్డీ హైవేపై బస్సు- లారీ ఢీ.. 10 మంది భక్తులు దుర్మరణం - 10 died in Shirdi accident

ఓ ప్రైవేటు బస్సు, లారీ ఢీకొని 10 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

Truck Bus accident Near Pathare on Sinnar Shirdi road

author img

By

Published : Jan 13, 2023, 9:45 AM IST

Updated : Jan 13, 2023, 11:51 AM IST

షిర్డీ హైవేపై బస్సు- లారీ ఢీ.. 10 మంది భక్తులు దుర్మరణం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన నాసిక్ జిల్లా పథారే సిన్నార్​ సమీపంలో నాసిక్​-షిర్డీ రహదారిపై జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
బస్సులో అంబర్​నాథ్​ థానే ప్రాంతానికి చెందిన 50 మంది సాయి భక్తులు.. షిర్డీ బయలుదేరారు. పథారే ప్రాంతంలో బస్సు- లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది చనిపోయారు. కాగా, బస్సులో ప్రయాణిస్తున్న చాలా మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను సిన్నార్ గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

.
.

మృతులకు ఎక్స్​గ్రేషియా..
ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ శిందే స్పందించారు. మృతులకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారి వైద్య ఖర్చులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంపై నాసిక్​ డివిజనల్​ కమిషనర్​ను అడిగి ముఖ్యమంత్రి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం నాసిక్, షిర్డీ ఆస్పత్రులకు తరలించాలని సూచించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు.

Last Updated : Jan 13, 2023, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.