ETV Bharat / bharat

ఆగస్టు నాటికి కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ ఉత్పత్తి ఎంతంటే.. - ఆగస్టులో టీకా ఉత్పత్తి

ఆగస్టు నాటికి తాము నెలకు 10 కోట్ల టీకా డోసులను ఉత్పత్తి చేస్తామని సీరం సంస్థ ​ తెలిపింది. అదే సమయంలో భారత్​ బయోటెక్​ సంస్థ.. తాము 7.8 కోట్ల టీకా డోసులు ఉత్పత్తి చేస్తామని చెప్పింది. ఈమేరకు రానున్న నాలుగు నెలల వ్యాక్సిన్​ ఉత్పత్తి ప్రణాళికను కేంద్రానికి ఇరు సంస్థలు సమర్పించాయి.

covishield, covaxin
కొవిషీల్డ్​, కొవాగ్జిన్​
author img

By

Published : May 12, 2021, 9:34 PM IST

దేశాన్ని టీకా​ కొరత వేధిస్తున్న తరుణంలో రానున్న నాలుగు నెలల వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రణాళికను కేంద్రానికి సమర్పించాయి భారత్​బయోటెక్​, సీరం సంస్థలు. ఆగస్టు నాటికి నెలకు 10 కోట్ల టీకా డోసులు ఉత్పత్తి చేస్తామని సీరం తెలపగా.. తాము నెలకు 7.8 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తామని భారత్​ బయోటెక్​ చెప్పింది. ఈ రెండు సంస్థలను జూన్​, జులై, ఆగస్టు, సెప్టెంబర్​ నెలలకు సంబంధించి టీకా ఉత్పత్తి ప్రణాళికను వివరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, డ్రగ్స్​ కంట్రోలర్​ ఆఫ్​ ఇండియాలు కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఈ ప్రణాళికను సమర్పించినట్లు చెప్పాయి.

హైదరాబాద్​కు చెందిన భారత్​ బయోటెక్​ సంస్థ కొవాగ్జిన్​ టీకాను ఉత్పత్తి చేస్తుండగా.. ఆక్స్​ఫర్డ్​-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్​ టీకాను పుణెకు చెందిన సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా ఉత్పత్తి చేస్తోంది.

జులైలో తాము 3.32 కోట్ల కొవాగ్జిన్​ టీకా డోసులు ఉత్పత్తి చేస్తామని భారత్​ బయోటెక్​ సంస్థ​ డైరెక్టర్​ డాక్టర్​ వి.కృష్ణ మోహన్​ తెలిపారు. ఈ సామర్థ్యాన్ని ఆగస్టులో 7.82 కోట్ల డోసులకు పెంచుతామని చెప్పారు. సెప్టెంబర్​లోనూ ఇంతే స్థాయిలో ఉత్పత్తిని కొనసాగిస్తామని పేర్కొన్నారు. అదే సమయంలో ఆగస్టు నాటికి తాము 10 కోట్ల టీకా డోసులు ఉత్పత్తి చేస్తామని సీరం సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఇదీ చూడండి: ఉచిత టీకా​ కోసం మోదీకి విపక్ష నేతల లేఖ

ఇదీ చూడండి: 'టీకాల ఉత్పత్తి పెంచాలని మార్చిలోనే చెప్పాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.