ETV Bharat / bharat

సీన్​ రివర్స్.. ఆ 'సూపర్​ హీరో'ను చుట్టుముట్టిన వివాదాలు - NCB Drug case Bollywood

ఆ ఎన్​సీబీ అధికారి.. కొద్దిరోజుల కిందటి వరకు సూపర్​ హీరో. ఇప్పుడు సొంత సంస్థే ఆయనపై దర్యాప్తునకు ఉపక్రమించింది. ఒకప్పుడు.. డ్రగ్స్​ ముఠాలకు సింహస్వప్నం. ఇప్పుడు.. ఆ డ్రగ్స్​ కేసుతోనే చిక్కులు చుట్టుముట్టాయి. ఆయనే.. సమీర్​ వాంఖడే (Sameer Wankhede news). కొద్దిరోజుల కింద షారుక్​ తనయుడు ఆర్యన్​ అరెస్టులో కీలకంగా వ్యవహరించిన.. ఎన్​సీబీ జోనల్​ అధికారి (Sameer wankhede ncb officer) సమీర్​ వాంఖడేపై ఇప్పుడు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఆయన వ్యక్తిగత జీవితంపైనా ప్రభావం పడింది. అసలు ఏం జరుగుతోంది? ఏం జరిగింది?

NCB OFFICER Sameer Wankhede
ఆ సూపర్​ హీరోను చుట్టుముట్టిన వివాదాలు
author img

By

Published : Oct 27, 2021, 6:17 PM IST

సమీర్​ వాంఖడే (NCB officer Sameer Wankhede).. మాదక ద్రవ్యాల 'తెర'చాటు వ్యవహారాలపై ఆయనో సింహ స్వప్నం. డ్రగ్స్​ ముఠాల గుట్టు రట్టు చేయడమే కాకుండా.. నిందితులు ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా విడిచిపెట్టరని పేరున్న నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూర్​ (ఎన్​సీబీ) జోనల్​ అధికారి (Sameer Wankhede news). అయితే.. ఇదంతా ఒకప్పుడు. ఇప్పటి సమీర్​ వాంఖడే వివాదాలకు కేంద్ర బిందువు. ఆయన పుట్టుక మొదలుకొని పెళ్లి, ఉద్యోగం అన్నింటిపైనా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కొద్దిరోజుల కిందటి వరకు సూపర్​ హీరోగా ఉన్న ఆయన.. ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నారు. అసలు ఇదంతా ఎలా మొదలైంది..?

ఆర్యన్​ అరెస్టుతో..

బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​ తనయుడు.. ఆర్యన్​ ఖాన్​ను (NCB Drug case Bollywood) అరెస్టు చేసింది సమీర్​ నేతృత్వంలోని ఎన్​సీబీ బృందమే. క్రూయిజ్​ నౌకపై దాడి జరిపి నిందితుల దగ్గర నుంచి భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఆర్యన్ (shah rukh khan son news) సహా పలువురిని అరెస్టు చేశారు. అప్పుడు మొదలైంది ఆరోపణల పర్వం.

డ్రగ్స్ కేసుకు (Cruise Drug Case) చెందిన ఓ సాక్షి.. ఆర్యన్​ను విడుదల చేసేందుకు సమీర్​ వాంఖడే (NCB officer Sameer Wankhede) షారుక్​ నుంచి రూ. 25 కోట్లు డిమాండ్​ చేసినట్లు ఆరోపించారు. దీనిపై దృష్టి సారించిన ఎన్​సీబీ చర్యలు ముమ్మరం చేసింది. ఎన్​సీబీ డిప్యూటీ డైరెక్టర్​ జనరల్​ జ్ఞానేశ్వర్​ సింగ్​ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందంతో దర్యాప్తు చేయిస్తోంది.

నవాబ్​ మాలిక్​ అటాక్​..

ఇదే సమయంలో సమీర్​ను (NCB Sameer Wankhede) లక్ష్యంగా చేసుకొని.. కొద్దిరోజులుగా వరుస ఆరోపణలు చేస్తున్నారు మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్ (Nawab Malik Sameer Wankhede)​. వ్యక్తిగత జీవితంపైనా ప్రశ్నలు గుప్పించారు. పుట్టుక, పెళ్లి మొదలుకొని ఉద్యోగం అన్నింటిపైనా అనుమానం వ్యక్తం చేశారు.

NCB OFFICER Sameer Wankhede
సమీర్​ మొదటి పెళ్లి ఫొటో షేర్​ చేసిన నవాబ్​ మాలిక్​

సమీర్​ పుట్టుకతోనే ముస్లిం అని.. ఆయన అసలు పేరు సమీర్​ దావూద్​ వాంఖడే అని తెలిపారు. సంబంధిత ఫొటోను కూడా షేర్​ చేశారు. ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నప్పటి ఫొటోలు సహా నిఖా నామాను (పెళ్లి అంగీకార పత్రం) కూడా ట్విట్టర్​లో బహిర్గతం​ చేశారు మాలిక్(Nawab Malik news)​.

NCB OFFICER Sameer Wankhede
ఖాజీ మౌలానా అహ్మద్​

సమీర్​ తండ్రి అసలు పేరు దావూద్​ వాంఖడే అని, జ్ఞాన్​దేవ్​ వాంఖడే కాదని ఆరోపించారు.

ఫోర్జరీ పత్రాల ద్వారా హిందూ ఎస్సీ కోటాలో ఉద్యోగాన్ని సంపాదించారని, ఇంకా.. బాలీవుడ్​ ప్రముఖుల ఫోన్లు ట్యాప్​ చేసి లంచం డిమాండ్​ చేశారని మాలిక్ ​(Nawab Malik news) ఆరోపించారు.

ఈ ఆరోపణలపై దృష్టి సారించిన ముంబయి పోలీసు విభాగం.. విచారణకు సిద్ధమైంది.

మొదటి పెళ్లిపై..

నవాబ్​ మాలిక్ (Nawab Malik news) ​ఆరోపణల నేపథ్యంలో.. 15 ఏళ్ల కిందట సమీర్​ పెళ్లి జరిపించిన ఇస్లాం మత పెద్ద ఖాజీ మౌలానా అహ్మద్​ స్పందించారు. వివాహం సమయంలో.. సమీర్​ (Sameer wankhede ncb officer) ముస్లిం వ్యక్తేనని తేల్చిచెప్పారు. ఒకవేళ ముస్లిం కాకుంటే.. పెళ్లి జరిపించేవాడినే కాదన్నారు.

మౌలానా అహ్మద్​

''సమీర్​ వాంఖడే-షబానా ఖురేషీ నిఖా నేనే జరిపించాను. ముంబయి లోఖండ్​వాలా కాంప్లెక్స్​ ప్రాంతంలో పెళ్లి జరిపించాలని ఆ యువతి తండ్రి నన్ను కలిశారు. షబానాను పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు సమీర్​ దావూద్​ వాంఖడే. అసలు సమీర్​ ముస్లిం కాకుంటే నేను పెళ్లి జరిపించకపోయేవాడిని.''

- మౌలానా, ఖాజీ

ఆ నిఖా తనకు ఇంకా గుర్తుందని, నిఖా నామాపై ఇస్లాం ఆచారాల ప్రకారమే అందరూ సంతకాలు చేశారని చెప్పుకొచ్చారు. మెహర్​గా(ఇస్లాం ప్రకారం నిఖా సమయంలో వధువుకు ఇచ్చే సెక్యూరిటీ డిపాజిట్​) అప్పుడు రూ. 33 వేలు వధువు కుటుంబానికి ఇచ్చారని కూడా గుర్తుచేసుకున్నారు.

సమీర్​ ఏమంటున్నారు?

2006లో ఓ ముస్లిం యువతిని వివాహం (Sameer wankhede wife) చేసుకున్నానని, అయితే.. ఇది ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం జరిగిందని అన్నారు సమీర్​ వాంఖడే (NCB Sameer Wankhede). ఆ తర్వాత అలాగే విడాకులు కూడా తీసుకున్నట్లు స్పష్టం చేశారు. తన తల్లి ముస్లిం, తండ్రి హిందూ అని చెప్పుకొచ్చారు. అసలు ఇస్లాంలోకి మారలేదని పేర్కొన్నారు.

తల్లి కోరిక మేరకే ముస్లిం సంప్రదాయంలో పెళ్లి (Sameer wankhede first wife) చేసుకున్నానని అంటున్నారు.

పరువు నష్టం దావా వేస్తాం..

సమీర్​ తండ్రి (Sameer wankhede father) కూడా.. తన పేరు దావూద్​ కాదని చెబుతున్నారు. తనకు అసలు ఉర్దూ రాదని, నిఖా నామాలో ఏం రాశారో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలన్నింటిలో తన పేరు జ్ఞాన్​దేవ్​ వాంఖడే అనే ఉందన్నారు. తమ వ్యక్తిగత జీవితంపై దాడి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను దళితుడినే అని, తమ పూర్వీకులు హిందువులు అని ఉద్ఘాటించారు. అలాంటప్పుడు తన కుమారుడు(Sameer Wankhede news) ముస్లిం ఎలా అవుతాడని అడిగారు.

Sameer Wankhede's father claims his ancestors were 'Dalit Hindus'
సమీర్​ వాంఖడే తండ్రి జ్ఞాన్​దేవ్​ వాంఖడే

''మా వ్యక్తిగత జీవితంపై కొంతకాలంగా దాడి జరుగుతోంది. ఒకవేళ నవాబ్​ మాలిక్​ మమ్మల్ని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేస్తూ ఉంటే మేం పరువునష్టం దావా వేస్తాం. కోర్టుకు వెళ్తాం. ఆయన అల్లుడు.. డ్రగ్స్​ కేసులో చిక్కుకున్నప్పటినుంచి మమ్మల్ని టార్గెట్​ చేశారు.''

- జ్ఞాన్​దేవ్​ వాంఖడే, సమీర్​ వాంఖడే తండ్రి

నవాబ్​ మాలిక్​ ట్విట్టర్​లో తప్పుడు ధ్రువపత్రాలు షేర్​ చేశారని అన్నారు సమీర్​ వాంఖడే (Sameer Wankhede news) రెండో భార్య, బాలీవుడ్​ నటి క్రాంతి రేద్కర్ (Sameer wankhede wife)​. తన తల్లి సంతోషం కోసమే మొదటి వివాహం ముస్లిం సంప్రదాయంలో చేసుకున్నారని, కులం, మతం మారలేదని స్పష్టం చేశారు.

ఏం జరుగుతోంది..?

మొత్తానికి తన ట్రాక్​ రికార్డ్​లో ఎన్నో కేసులను అవలీలగా ఎదుర్కొన్న సమీర్​ వాంఖడే(Sameer wankhede wife) ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. బాలీవుడ్​ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆయన ఇప్పుడు.. ఎన్​సీబీ దర్యాప్తు ఎదుర్కొంటున్నారు. తదుపరి ముంబయి పోలీసు విభాగం ప్రశ్నించనుంది. ఆయన ఉద్యోగం కూడా పోయే ప్రమాదం ఉంది.

ఇవీ చూడండి: 'రాజీనామా అక్కర్లేదు.. చట్టప్రకారమే వాంఖడే ఉద్యోగం పోతుంది'

సమీర్ వాంఖెడేకు బిగుస్తున్న ఉచ్చు.. ఎన్​సీబీ విజిలెన్స్ విచారణ

సమీర్‌ వాంఖడే.. 'తెర'చాటు డ్రగ్స్‌పై ముంబయి 'సింగం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.