ETV Bharat / bharat

పంజాబ్​లో కాంగ్రెస్ దారెటు? ఇక కష్టమేనా? - పంజాబ్ కాంగ్రెస్​ వార్తలు

కాంగ్రెస్​ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పంబాబ్​లో గత కొద్దినెలలుగా నెలకొన్న సంక్షోభం(punjab congress crisis) నూతన సీఎం ఎంపికతో ముగిసిందని భావిస్తున్న తరుణంలో నవ్​జ్యోత్ సింగ్​ సిద్ధూ షాక్ ఇచ్చారు. పంజాబ్ పీసీసీ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు మాజీ సీఎం అమరీందర్ సింగ్ భాజపాలో చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానంలో అయోమయం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో పంజాబ్​లో కాంగ్రెస్​ భవిష్యత్​ ఎలా ఉండనుంది? కొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఏమేరకు ప్రభావం చూపగలదు? అమరీందర్, సిద్ధూకు దీటుగా... రాష్ట్రస్థాయిలో ప్రజాదరణ గల నేతలు ఎవరైనా ఉన్నారా? అనే విషయలు చర్చనీయాంశమయ్యాయి.

punjab congress crisis
కాంగ్రెస్​కు వరుస షాక్​లు
author img

By

Published : Sep 28, 2021, 7:44 PM IST

పంజాబ్​ కాంగ్రెస్​లో నెలకొన్న సంక్షోభం(punjab congress crisis) దాదాపు ముగిసినట్లేనని భావిస్తున్న ఆ పార్టీ అధిష్ఠానానికి ఊహించని షాక్ ఇచ్చారు నవ్​జ్యోత్ సింగ్ సిద్దూ. పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు(navjot singh sidhu resigns). ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ పంపారు(punjab congress news today ). రాజీపడితే వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్లేనని, అందుకు తాను సిద్ధంగా లేనని లేఖలో పేర్కొన్నారు. పంజాబ్ భవిష్యత్, సంక్షేమ అజెండా విషయంలో రాజీపడటం ఇష్టంలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పీసీసీ బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోనే సిద్ధూ తప్పుకోవడం(navjot singh sidhu news) గమనార్హం.

మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్​ సింగ్ రాజీనామా(punjab cm resign) అనంతరం దళిత వర్గానికి చెందిన చరణ్​జీత్ సింగ్​ను నూతన సీఎంగా(punjab cm news) నియమించింది కాంగ్రెస్ అధిష్ఠానం(punjab congress news). నవ్​జ్యోత్ సింగ్ సిద్ధూ, అమరీందర్​ విభేదాలతో గతకొద్ది నెలలుగా పంజాబ్​ కాంగ్రెస్​లో నెలకొన్న సంక్షోభం ఇక సమసిపోయినట్లేనని భావించింది. కానీ సిద్ధూ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఆ పార్టీ మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొద్ది నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు జరుగుతుండటం కాంగ్రెస్​ను అయోమయంలో పడేస్తున్నాయి. అమరీందర్​ సింగ్ భాజపాలో చేరతారని ఊహాగానాలు వస్తుండటం, పార్టీలో ప్రజాదరణ ఉన్న నేతలు ఎవరూ కన్పించకపోవడం, సీఎం చన్నీకి అనుభవం లేకపోవడం పార్టీని కలవరానికి గురి చేస్తోంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్​లో అధికారం నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? ఎవర్ని తెరపైకి తెస్తుంది? ఆ పార్టీ వ్యూహాలు ఎలా ఉంటాయి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

'నేను ముందే చెప్పా'

పీసీసీ చీఫ్​గా సిద్ధూ(navjot singh sidhu news) తప్పుకున్న వెంటనే.. అమరీందర్​ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సిద్దూకు స్థిరత్వం లేదని తాను ముందునుంచే చెబుతున్నానని, పంజాబ్​ లాంటి సరిహద్దు రాష్ట్రానికి ఆయన తగరని పేర్కొన్నారు. అయితే భాజపాలో చేరేందుకే అమరీందర్​ దిల్లీ వెళ్లారని, అమిత్​ షాను కలిసి కమలంపార్టీ కండువా కప్పుకుంటారని వచ్చిన ఊహాగానాలపై ఆయన స్పందించారు. ప్రస్తుతం ఏ రాజకీయ నాయకుడిని కలవడం లేదని, సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేందుకే దిల్లీ వచ్చినట్లు వివరించారు.

సిద్ధూ రాజీనామాపై ఆమ్​ఆద్మీ పార్టీ సైతం విమర్శలు గుప్పించింది. దళితుడు, పేద కుటుంబానికి చెందిన చరణ్​జీత్​ సింగ్​ చన్నీ సీఎం కావడం జీర్ణించుకోలేకే సిద్ధూ తన పదవి నుంచి తప్పుకున్నారని ఆరోపించింది. అది అత్యంత బాధాకరమని వ్యాఖ్యానించింది. పాకిస్థాన్​తో 550కి.మీ సరిహద్దు ఉన్న పంబాబ్​కు సిద్ధూ లాంటి అస్థిర నాయకుడు కరెక్ట్ కాదని విమర్శించింది. పంజాబ్ కాంగ్రెస్​లో అరాచక సంక్షోభానికి ఇది నిదర్శమని దుయ్యబట్టింది.

సిద్ధూ రాజీనామా అందుకేనా..​

అయితే సిద్ధూ రాజీనామా చేయడానికి ప్రధానంగా ఐదు కారణాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

  1. అమరీందర్ సింగ్ రాజీనామా తర్వాత పంజాబ్ సీఎం బాధ్యతలను కాంగ్రెస్ అధిష్ఠానం తనకే అప్పగిస్తుందని సిద్ధూ భావించారు. కానీ సిద్ధూ సీఎం అయితే దేశానికే ముప్పు అని కెప్టెన్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు ఆ అవకాశం రాకుండా చేశాయి.
  2. కొత్త సీఎం చన్నీ తనకు సన్నిహితుడని, తాను చెప్పినట్లు నడుచుకుంటారని సిద్ధూ భావించారు. కానీ అందుకు విరుద్ధంగా చన్నీ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. స్వయంగా తాను ఎంపిక చేసిన వ్యక్తులకే కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో సిద్ధూ హర్ట్ అయ్యారు.
  3. అడ్వకేట్ జనరల్​ నియామకంపై సిద్ధూ అసహనంగా ఉన్నారు. అన్మోల్​ రతన్​కు ఆ బాధ్యతలు అప్పగించాలని ఆయన సూచించారు. కానీ చన్నీ మాత్రం ఏపీఎస్​ దేఓల్‌ను ఎంపిక చేశారు.
  4. కేబినెట్​ విస్తరణలో తనదే పైచేయి కావాలని సిద్ధూ అనుకున్నారు. కానీ వారం రోజుల పాటు సుదీర్ఘ మంతనాల అనంతరం కొత్త మంత్రివర్గానికి అధిష్ఠానం ఆమోదం తెలిపింది. అయితే ఇందులో ఎక్కువగా అమరీందర్​ సింగ్ అనుచరులకే ప్రాధాన్యం ఇవ్వడం, చన్నీ చెప్పిన వారినే చేర్చుకోవడం సిద్ధూకు నచ్చలేదు. తాను ప్రతిపాదించిన వారిలో కొంతమందికి అవకాశం ఇవ్వకపోడవమూ సిద్ధూకు అసహనం కల్గించాయి.
  5. కనీసం పంజాబ్ హోంశాఖ అయినా తన చేతుల్లో ఉంటుందని సిద్ధూ అనుకున్నారు. కానీ సుఖ్​జిందర్​ సింగ్​కు ఆ బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్​. డిప్యూటీ సీఎం బాధ్యతలు కూడా ఆయనకే ఇచ్చింది.

దీంతో పీసీసీ పదవిలో ఉన్నా తన పెత్తనం సాగడం లేదనే కారణంతోనే సిద్ధూ రాజీనామా చేసి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సిద్ధూ బాటలో మరింత మంది!

పీసీసీ చీఫ్​గా రాజీనామా చేసిన సిద్ధూకు మద్దతుగా రెండు రోజుల క్రితం కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రజీయా సుల్తానా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సిద్ధూకు సిద్ధాంతాలున్నాయని, పంజాబీల శ్రేయస్సు కోసమే ఆయన పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఆయనతో పాటే కలిసి ముందుకు సాగాతానన్నారు.

పంజాబ్ కాంగ్రెస్ యోగిందర్ ధింగ్రా, రాష్ట్ర పార్టీ కోశాధికారి గుల్జార్ ఇందర్ చాహల్ సైతం సిద్ధూకు మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేశారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్​లోకి కన్నయ్య.. 'మునిగే ఓడను కాపాడేందుకు'...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.