ISRO Chairman: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో ఛైర్మన్‌గా సీనియర్ రాకెట్ సైంటిస్ట్ ఎస్.సోమనాథ్ నియమితులయ్యారు. నియామకాల కేబినెట్ కమిటీ అందుకు ఆమోదం తెలిపింది. ఇస్రో ఛైర్మన్ శివన్ పదవీకాలం ఈనెల 14న పూర్తి కానుండటం వల్ల సోమనాథ్ నియామకం జరిగింది.
ఇంతవరకు సోమనాథ్ తిరువనంతపురంలోని విక్రం సారభాయ్ అంతరిక్ష కేంద్రం సంచాలకునిగా వ్యవహరించారు. కొల్లాంలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆయన బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. 1985లో ఇస్రోలో చేరిన సోమనాథ్ ఉపగ్రహ వాహననౌకల డిజైనింగ్‌లో కీలకభూమికి పోషించారు.
ఇదీ చూడండి: 'ఒమిక్రాన్‌ను సాధారణ జలుబుగా భావించవద్దు'