Senior Congress Leaders Quit Party: కాంగ్రెస్ సినీయర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. తమకు లేదా తమ సన్నిహితుకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనో.. అడిగిన హోదా, పదవి ఇవ్వలేదనో.. ఇలా కారణం ఏదైనా పార్టీకి షాక్ ఇస్తున్నారు.
![Senior Cong leader, MLC C.M. Ibrahim](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-bng-01-cm-ibrahim-talk-script-7208077_27012022131959_2701f_1643269799_788_2701newsroom_1643283403_1093.jpg)
తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం.. పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఇబ్రహీం ఆశించిన శాసన మండలి ప్రతిపక్ష నేత హోదాను.. బీకే హరిప్రసాద్‌కు పార్టీ కట్టబెట్టింది. దీంతో మనస్తాపానికి గురైన ఇబ్రహీం.. కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. "కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. నాపై ఉన్న భారాన్ని తొలగించినందుకు సంతోషంగా ఉంది. ఇకపై నేను స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటాను. కాంగ్రెస్ ముగిసిన అధ్యాయం. రాష్ట్రంలోని నా శ్రేయోభిలాషులతో చర్చించి త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా" అని ఇబ్రహీం పేర్కొన్నాడు.
ఇబ్రహీం.. మాజీ కేంద్ర మంత్రి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడకు ఒకప్పుడు సన్నిహితుడు. 2008లో కాంగ్రెస్‌లో చేరారు. అయితే కొంతకాలంగా పార్టీతో పాటు సిద్ధరామయ్యతో విభేదాలు వచ్చాయి. అప్పటినుంచి అసంతృప్తితో ఉన్న ఇబ్రహీం.. ఇప్పుడు పూర్తిగా పార్టీని వీడాలని నిర్ణయించుకన్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: కాంగ్రెస్‌కు షాక్.. భాజపాలోకి మరో సీనియర్ నేత