ETV Bharat / bharat

రాజకీయాల్లోకి సీమా హైదర్​.. లోక్​సభ టికెట్ కన్ఫామ్.. ఆ రాజకీయ పార్టీ నుంచి అవకాశం..

Seema Haider Latest News : పబ్​జీ గేమ్​తో ప్రేమలో పడి భారత్​కు అక్రమంగా వచ్చిన పాక్​ మహిళ సీమా హైదర్​కు.. వరుస ఆఫర్లు వస్తున్నాయ. సీమకు 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్​ ఇస్తామని ప్రకటించింది ఓ రాజకీయ పార్టీ. అంతకుముందు ఆమెకు ఓ సినిమాలో 'రా' ఏజెంట్​ పాత్ర ఆఫర్​ చేశారు.

Seema Haider Latest News
Seema Haider Latest News
author img

By

Published : Aug 3, 2023, 9:54 PM IST

Seema Haider Latest News : పబ్‌జీ గేమ్‌లో పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్​ నుంచి భారత్‌లోకి అక్రమ మార్గంలో అడుగుపెట్టిన సీమా హైదర్‌ బంఫర్​ ఆఫర్​ కొట్టేసింది. 2024 లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ దక్కించుకుంది! సీమాకు టికెట్ ఇస్తామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్​ ఇండియా (అఠావలే) ప్రకటించింది. ఈ ఆఫర్​ను సీమ అంగీకరించినట్లు తెలిసింది. ఈ మేరకు రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్షుడు మఖన్ కిషోర్ ఓ వీడియో విడుదల చేశారు. సెక్యూరిటీ ఏజెన్సీలు సీమ హైదర్​కు క్లీన్ చిట్ ఇస్తే.. పార్టీలోకి ఆమెను స్వాగతించేందుకు సమస్యలేం లేవని కిషోర్ అన్నారు. సీమ అద్భుతమైన వక్త అని.. ఆమెకు తమ పార్టీలో అధికార ప్రతినిధి పదవి కూడా ఇవ్వవచ్చు అని కిషోర్ అన్నారు. కాగా, ఆర్​పీఐ జాతీయ అధ్యక్షుడు రాందాస్ అఠావలే.. మోదీ ప్రభుత్వంలో రెండోసారి కేబినెట్ మంత్రిగా ఉన్నారు.

'సీమ కేసును.. పోలీసులు, కేంద్ర సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఒకవేళ ఆమెకు క్లీన్ చిట్ ఇస్తే.. మా పార్టీలోకి చేర్చుకోవాలని కోరుకుంటున్నా. ఆమె కావాలనుకుంటే 2024 ఎన్నికల్లో మా పార్టీ నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్ ఇస్తాం'
-- మఖన్ కిషోర్, రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్షుడు

సీమా హైదర్​.. కొట్టేసింది సినిమా ఛాన్స్​..
Seema Haider Pakistan : అయితే, దీనికంటే ముందు సీమా హైదర్‌ సినిమా ఛాన్స్‌ కొట్టేసింది. ఉదయ్‌పుర్‌ టైలర్‌ కన్హయ్య లాల్‌ హత్య ఘటనపై 'ఏ టైలర్‌ మర్డర్‌ స్టోరీ' పేరిట ఓ చిత్రాన్ని జానీ ఫైర్‌ఫాక్స్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ త్వరలో తెరకెక్కించనుంది. ఈ సినిమాలో 'రా' ఏజెంట్‌ పాత్ర కోసం సీమాను సంప్రదించారు. ఈ మేరకు చిత్ర దర్శకులు జయంత్‌ సిన్హా, భరత్‌ సింగ్‌లు మంగళవారం ఆమెకు ఆడిషన్‌ నిర్వహించారు.

Seema Haider Case : జులై 4న సీమాను అరెస్టు చేసి అప్పటి నుంచి యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ విచారణ జరుపుతోంది. పాకిస్థాన్‌లోని కరాచీ నివాసి సీమా.. PUBG ఆడుతున్నప్పుడు గ్రేటర్ నోయిడాలోని రబూపురా నివాసి సచిన్ మీనాతో స్నేహం ఏర్పడింది. అనంతరం తన నలుగురు పిల్లలతో నేపాల్ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి.. గ్రేటర్ నోయిడాలోని రబుపురాకు చేరుకుంది. తమ స్నేహం ప్రేమగా మారిందని, అతడితో కలిసి జీవించేందుకు భారత్‌కు వచ్చానని అప్పుడు సీమా చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.