ETV Bharat / bharat

అమితాబ్‌ నివాసానికి బాంబు బెదిరింపు - బాంబు బెదిరింపు

బాలీవుడ్​ నటుడు అమితాబ్​ బచ్చన్​ నివాసానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. మరో మూడు ప్రధాన రైల్వే స్టేషన్లకు బెదిరింపులు రాగా.. బిగ్​ బీ నివాసం సహా రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు.

bomb threat
అమితాబ్‌ నివాసానికి బాంబు బెదిరింపు.
author img

By

Published : Aug 7, 2021, 10:21 AM IST

Updated : Aug 7, 2021, 4:28 PM IST

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ నివాసం, ముంబయిలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు బిగ్‌బీ నివాసం, రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను పెంచి విస్తృత తనిఖీలు చేపట్టారు. అయితే అది నకిలీ బెదిరింపు కాల్‌ అని తేలడం వల్ల.. అంతా ఊపిరిపీల్చుకున్నారు.

bomb threat
అమితాబ్‌ నివాసానికి బాంబు బెదిరింపు.. భద్రత పెంపు

ముంబయి పోలీసు ప్రధాన కంట్రోల్‌ రూమ్‌కు శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఓ కాల్‌ వచ్చింది. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టర్మినస్‌, బైకుల్లా, దాదర్‌ రైల్వే స్టేషన్లు, జుహూలోని అమితాబ్‌ నివాసం వద్ద బాంబులు పెట్టినట్లు ఆగంతకుడు సమాచారమిచ్చాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌కు సమాచారమిచ్చారు. బాంబు స్క్వాడ్‌, జాగిలాలను తీసుకొని బిగ్‌బీ నివాసం సహా రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదు. అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అది నకిలీ బెదిరింపు కాల్‌గా నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు. కాల్‌ చేసిన వ్యక్తి గురించి తెలుసుకునేందుకు దర్యాప్తు సాగుతున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'సీబీఐలో మార్పు రాదా?'

Last Updated : Aug 7, 2021, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.