ETV Bharat / bharat

నక్సల్స్ చెరలో కోబ్రా కమాండో- నిజమెంత? - నక్సల్స్​ దాడి ఛత్తీస్​గఢ్

కోబ్రా కమాండో రాకేశ్వర్​ సింగ్​ను కిడ్నాప్​ చేశామన్న నక్సలైట్ల ప్రకటనలో నిజానిజాలు తేల్చేందుకు భద్రతా సంస్థలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు...​ రాకేశ్వర్​ అపహరణపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆయన్ను నక్సల్స్ చెర నుంచి విడిపించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

cobra commando kidnapped by naxals, సీఆర్పీఎఫ్‌ జవాన్‌ కిడ్నాప్
నక్సల్స్​ ఛత్తీస్​గఢ్
author img

By

Published : Apr 5, 2021, 4:12 PM IST

ఛత్తీస్​గఢ్​లోని బీజాపుర్​ వద్ద శనివారం ఎన్​కౌంటర్​ జరిగిన సమయంలో ఓ కోబ్రా కమాండోను అపహరించినట్లు నక్సల్స్​ చేసిన ప్రకటనలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కిడ్నాపైనట్లు భావిస్తున్న జవాను 210 కోబ్రా బెటాలియన్​కు చెందిన రాకేశ్వర్​ సింగ్​ మిన్హాస్​గా అధికారులు గుర్తించారు. అయితే ఈ అపహరణపై స్పష్టత ఇవ్వలేమని పేర్కొన్నారు. రాకేశ్వర్​ను కిడ్నాప్​ చేశామని మావోయిస్టులు ఆదివారం సాయంత్రం స్థానిక జర్నలిస్టుకు సమాచారం అందించారు.

"కమాండో రాకేశ్వర్​ సింగ్​ మిన్హాస్​ ఆచూకీని ఇంకా కనుగొనలేదు. అయితే ఇది నక్సల్స్​ పనేనని కచ్చితంగా చెప్పడానికి తగిన ఆధారాలు మా వద్ద లేవు. దీనిపై దర్యాప్తు చేపడుతున్నాము. రాకేశ్వర్​ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాము"

-సీనియర్ అధికారి

జమ్ము కశ్మీర్​కు చెందిన రాకేశ్వర్​ విడుదలపై సమయం చూసి చర్చించాలని నక్సల్స్​ భావిస్తున్నట్లు సమాచారం.

బృందాలతో గాలింపు..

రాకేశ్వర్​ ఆచూకీ కనుగొనేందుకు భద్రతా దళాలకు చెందిన వివిధ బృందాలు అటవీ ప్రాంతంలో ముమ్మరంగా గాలిస్తున్నాయని, ఈ క్రమంలో నక్సల్స్​ జాడ గుర్తించేందుకు కూడా కృషి చేస్తున్నాయని అధికారులు తెలిపారు.

కమాండో బెటాలియన్ ఫర్​ రిసోల్యూట్​ యాక్షన్​ (కోబ్రా).. నక్సల్స్​ను మట్టుపెట్టేందుకు 2009లో రూపొందిన ప్రత్యేక విభాగం. ఈ విభాగంలోనే రాకేశ్ విధులు నిర్వహిస్తున్నారు.

ఆందోళన..

రాకేశ్వర్​ అపహరణపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రాకేశ్వర్​ను నక్సల్స్ చెర నుంచి విడిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్​ షాకు విజ్ఞప్తి చేశారు. జమ్ములోని బార్నాయ్​ గ్రామంలో రాకేశ్వర్​ కుటుంబం నివసిస్తోంది.

రాకేశ్వర్​ సింగ్​ కుటుంబ సభ్యులు

ఇదీ చదవండి : 'పేలవ ప్రణాళికే నక్సల్​ దుశ్చర్యకు కారణం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.