చమురు ధరలపై విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ అట్టుడికింది. పెరుగుతున్న చమురు ధరలపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుపట్టడం వల్ల స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. సభ ప్రారంభమైన కొద్ది సేపటి తర్వాతే విపక్షాలు ఆందోళనలకు దిగాయి. దాంతో పలుమార్లు వాయిదా పడింది సభ.
చమురు ధరలపై అట్టుడికిన లోక్‌సభ-రేపటికి వాయిదా - పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు లైవ్
19:49 March 08
లోక్‌సభ మంగళవారానికి వాయిదా
17:22 March 08
మళ్లీ వాయిదా
చమురు ధరలపై లోక్‌సభ సైతం అట్టుడికింది. పెరుగుతున్న చమురు ధరలపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుపట్టడం వల్ల స్పీకర్ సభను మరోసారి వాయిదా వేశారు. సాయంత్రం ఏడు గంటలకు తిరిగి సభ ప్రారంభం కానుంది.
16:36 March 08
లోక్‌సభ వాయిదా..
సాయంత్రం 4గంటలకు లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన ఇద్దరు సిట్టింగ్, ఏడుగురు మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. అనంతరం స్పీకర్ సభను 5గంటలకు వాయిదా వేశారు.
13:51 March 08
రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. పెరుగుతున్న చమురు ధరలపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించడంతో సభాపతి సభను వాయిదా వేశారు. రేపటి నుంచి రాజ్యసభ కార్యక్రమాలు సాధారణంగానే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కొనసాగుతాయని ఛైర్మన్ తెలిపారు.
12:17 March 08
రాజ్యసభ 1గంటకు తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా చమురు ధరలపై చర్చ చేపట్టాలని ఆందోళన కొనసాగిస్తామని సభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే తెలిపారు.
11:07 March 08
రాజ్యసభ 11 గంటలకు తిరిగి ప్రారంభమైనా చమురు ధరలపై విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. తక్షణమే ఈ విషయంపై చర్చించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. దీంతో సభను మరోసారి మధ్యాహ్నం 1గంటకు వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు.
09:59 March 08
దేశంలో పెరుగుతున్న పెట్రో ధరలపై వాయిదా తీర్మానానికి నోటీసులిచ్చారు రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. ఈ విషయంపై సభలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. దీనికి ఛైర్మన్ వెంకయ్య నాయుడు నిరాకరించారు. దీనిపై సభలో తర్వాత చర్చిద్దామన్నారు. ప్రతిపక్ష నేతలు మాత్రం తక్షణమే చర్చ జరపాలని పట్టుబట్టారు. సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభను 11 గంటలకు వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు.
09:37 March 08
-
#InternationalWomensDay is a day to celebrate the social, economic, cultural and political contributions & achievements of women across the globe and honour their indomitable spirit, resolute determination & efforts that underline their achievements: Rajya Sabha Chairman pic.twitter.com/GvQlvYPKZX
— ANI (@ANI) March 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#InternationalWomensDay is a day to celebrate the social, economic, cultural and political contributions & achievements of women across the globe and honour their indomitable spirit, resolute determination & efforts that underline their achievements: Rajya Sabha Chairman pic.twitter.com/GvQlvYPKZX
— ANI (@ANI) March 8, 2021#InternationalWomensDay is a day to celebrate the social, economic, cultural and political contributions & achievements of women across the globe and honour their indomitable spirit, resolute determination & efforts that underline their achievements: Rajya Sabha Chairman pic.twitter.com/GvQlvYPKZX
— ANI (@ANI) March 8, 2021
ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో సాధించిన విజయాలకు ప్రతీకగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకొంటామని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు అన్నారు. వారి అంకితభావానికి, ఆత్మ స్థైర్యాన్ని గౌరవించాలన్నారు.
09:06 March 08
-
Sudip Bandyopadhyay, Floor Leader of TMC Parliamentary Party in Lok Sabha & Derek O'Brien, Leader of TMC Parliamentary Party in Rajya Sabha write to Lok Sabha Speaker & Rajya Sabha Chairman respectively for adjournment of Parliament session due to Assembly polls in 5 states. pic.twitter.com/yUW2Ek0d6t

">Sudip Bandyopadhyay, Floor Leader of TMC Parliamentary Party in Lok Sabha & Derek O'Brien, Leader of TMC Parliamentary Party in Rajya Sabha write to Lok Sabha Speaker & Rajya Sabha Chairman respectively for adjournment of Parliament session due to Assembly polls in 5 states. pic.twitter.com/yUW2Ek0d6t
— ANI (@ANI) March 8, 2021Sudip Bandyopadhyay, Floor Leader of TMC Parliamentary Party in Lok Sabha & Derek O'Brien, Leader of TMC Parliamentary Party in Rajya Sabha write to Lok Sabha Speaker & Rajya Sabha Chairman respectively for adjournment of Parliament session due to Assembly polls in 5 states. pic.twitter.com/yUW2Ek0d6t
— ANI (@ANI) March 8, 2021
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు తృణమూల్ కాంగ్రెస్ లేఖ రాసింది.
08:39 March 08
పార్లమెంట్ లైవ్: ప్రతిపక్షాల ఆందోళనల నడుమ రాజ్యసభ రేపటికి వాయిదా
కొవిడ్ నిబంధనల నడుమ పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4గం.నుంచి రాత్రి 9గంటల వరకు లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. జనవరి 29న ప్రారంభమైన పార్లమెంట్ తొలివిడత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13వరకు కొనసాగాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగం తర్వాత ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం, బడ్జెట్‌పై సాధారణ చర్చ జరిగింది. వీటితో పాటు వ్యవసాయ చట్టాలపైనా చర్చ జరిగిన తర్వాత పార్లమెంట్ మార్చి 8వరకు వాయిదా పడింది.
నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగునున్న వేళ కేంద్ర ప్రభుత్వం తాజా సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అందులో పింఛన్ ఫండ్ రెగ్యులేటరి అండ్ డెవలప్మెంట్ అథారిటి బిల్, విద్యుత్ సవరణ బిల్లు, క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లులు ఉన్నాయి.
కుదించే అవకాశం?
తొలి విడతలో మొత్తం 49 గంటల 17నిమిషాల పాటు చర్చ జరిగిందని లోక్‌సభ కార్యాలయం తెలిపింది. వీటిలో అత్యధికంగా 16గంటల 39 నిమిషాలు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమానికి తీసుకున్నట్లు ప్రకటించింది. మరో పది గంటలను సాధారణ బడ్జెట్‌పై చర్చ జరిపేందుకు కేటాయించగా, మొత్తం 117మంది పార్లమెంట్ సభ్యులు చర్చలో పాల్గొన్నట్లు వెల్లడించింది. మార్చి 8న ప్రారంభమయ్యే ఈ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 8న ముగుస్తాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బులిటెన్‌లో వెల్లడించారు. అయితే, ఎన్నికల నేపథ్యంలో రెండో విడత బడ్జెట్ సమావేశాలను కుదించే అవకాశాలు ఉన్నాయి. దాదాపు రెండువారాలపాటు తగ్గించవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే సోమవారం జరిగే సభాపక్ష నేతల సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
వ్యాక్సినేషన్ కేంద్రాలు
ఇక దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోన్న నేపథ్యంలో అటు పార్లమెంట్‌లోనూ రెండు వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. పార్లమెంట్ సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు వ్యాక్సిన్ తీసుకున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ సమాచారం ప్రకారం, 36శాతం మంది లోక్‌సభ, 62శాతం మంది రాజ్యసభ సభ్యుల వయసు 60 సంవత్సరాలకు పైబడినవారే ఉన్నారు.