పెరుగుతున్న చమురు ధరలపై విపక్షాల ఆందోళనతో పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. వరుసగా రెండో రోజు విపక్ష సభ్యులు నిరసన కొనసాగించారు. ఈ విషయంపై చర్చకు పట్టుబట్టారు. దీంతో మంగళవారం కూడా ఎలాంటి చర్చ లేకుండానే లోక్ సభ, రాజ్య సభ రేపటికి వాయిదా పడ్డాయి.
విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు రేపటికి వాయిదా - second part of parliament budget session live updates
14:16 March 09
14:07 March 09
చమురు ధరలపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్.
12:18 March 09
వాయిదాల పర్వం..
పెట్రో ధరలపై చర్చించాలని విపక్షాలు రెండో రోజూ పార్లమెంటులో ఆందోళన కొనసాగించాయి. సభలో పెద్దఎత్తున నినాదాలు చేశాయి. వాయిదా అనంతరం ఉభయ సభలు 12గంటలకు తిరిగి ప్రారంభమైనా విపక్షాలు వెనక్కి తగ్గలేదు. దీంతో లోక్‌సభ, రాజ్యసభ మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా పడ్డాయి.
12:12 March 09
12 గంటలకు లోక్‌సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్షాలు ఆందోళన విరమించలేదు. దీంతో స్పీకర్ సభను మరోసారి మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా వేశారు.
11:28 March 09
చమురు ధరలపై చర్చ జరపాలని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.
11:21 March 09
విపక్షాల ఆందోళనల నేపథ్యంలో లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా.
11:18 March 09
రాజ్యసభలో నినాదాలు
చమురు ధరల పెరుగుదలకు నిరసనగా రాజ్యసభలో విపక్షాలు ఇవాళ కూడా ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఈ విషయంపై చర్చ జరపాలని విపక్ష సభ్యులు సభలో పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు.
10:36 March 09
విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు రేపటికి వాయిదా
రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ రెండో రోజు సమావేశమైంది. కరోనా మునుపటిలా సభ ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. చుమురు ధరలపై చర్చ జరపాలని విపక్షాల ఆందోళనల నడుమ రాజ్యసభ, లోక్‌సభలో సోమవారం ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు.