దిల్లీ ఎన్సీఆర్(నేషనల్ క్యాపిటల్ రీజియన్)లోని స్కూళ్లు, కళాశాలలు, ఇతర విద్యావ్యవస్థలను మూసివేస్తూ(ncr pollution news ).. మంగళవారం రాత్రి ఆదేశాలిచ్చింది సీఏక్యూఎమ్(కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్). తదుపరి ఆదేశాలిచ్చే వరకు విద్యాసంస్థలు తెరవకూడదని స్పష్టం చేసింది. విద్యావ్యవస్థ అంతా ఆన్లైన్లో సాగించాలని పేర్కొంది. వాయుకాలుష్యాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది సీఏక్యూఎమ్(delhi air pollution news).
దిల్లీకి 300కిలోమీటర్ల పరిధిలో మొత్తం 11 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉండగా.. ఈ 30వరకు ఐదు మాత్రమే పనిచేస్తాయని సీఏక్యూఎమ్ వెల్లడించింది. ఈ నెల 21వరకు నిర్మాణాలు, భవనాల కూల్చివేత కార్యకలాపాలు చేయకూడదని దిల్లీ, ఎన్సీఆర్ యంత్రాంగానికి తెలిపింది. రైల్వే, మెట్రో, బస్సు సర్వీసులు కూడా తమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.
నిత్యావసరాలు మినహా ఇతర వస్తువులు మోసుకెళ్లే ట్రక్కులు, వాహనాలకు దేశ రాజధానిలోకి ప్రవేశం లేదు. ఆదివారం వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది. హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ ఎన్సీఆర్ ప్రాంతం అధికారులతో మంగళవారం జరిగిన సమావేశమైన అనంతరం ఈ ప్రకటన వెలువరించింది సీఏక్యూఎమ్.
సుప్రీంలో విచారణ..
దిల్లీలో కాలుష్యం తగ్గించేందుకు తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు దిల్లీలో గాలి నాణ్యత పెంపునకు ఎయిర్ క్వాలిటీ కమిషన్ మేనేజ్‌మెంట్ కమిషన్ చేసిన సూచనలను.. అఫిడవిట్‌లో పేర్కొంది. పదేళ్లు పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు రోడ్డుపైకి రాకుండా చూడాలని సూచించింది. దిల్లీలో వాటర్ స్ప్రింకర్లు, యాంటీ స్మోగ్‌గన్‌లు అమర్చాలని సూచించింది. పరిశ్రమలు గ్యాస్ ఉపయోగిస్తేనే నడిపేందుకు అనుమతులు ఇవ్వాలని. లేని పక్షంలో అన్నింటినీ మూసివేయాలని పేర్కొంది.
దిల్లీలో..
వాయుకాలుష్యాన్ని నియత్రించేందుకు ఇప్పటికే దిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి ఏడు రోజుల పాటు పాఠశాలలు మూసివేయాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు కూడా ఇళ్ల నుంచి విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించే విషయాన్ని పరిశీలించన్నారు(delhi lockdown news today). భవన నిర్మాణ కార్యకలాపాలు కూడా నవంబర్ 14-17 వరకు పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించారు.
దిల్లీలో వాయుకాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిన కారణంగా లాక్డౌన్ విధించడంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సుప్రీంకోర్టు చేసిన సూచన మేరకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది(delhi news lockdown ). వాయునాణ్యత సూచి 499కి చేరినందున త్వరితగతిన చర్యలు చేపట్టింది. పాఠశాలలను మూసి వేస్తే పిల్లలు విషవాయువును పీల్చే ముప్పు ఉండదని కేజ్రీవాల్ అన్నారు. అయితే తరగతులను వర్చువల్‌గా ఆన్లైన్లో నిర్వహించాలన్నారు.
విష వాయువు...
వాహన కాలుష్యం, పంట వ్యర్ధాల దహనంతో దేశ రాజధాని దిల్లీ, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో గత కొంత కాలంగా క్షీణించిన వాయు నాణ్యత మరింత ప్రమాదకర స్ధాయికి చేరింది(delhi air pollution news). దిల్లీలో వాయు నాణ్యత సూచీ 473గా నమోదైంది. దిల్లీ చుట్టుపక్కల ఉన్న నోయిడాలో ఇది 587గా నమోదు కాగా, గురుగ్రామ్‌లో 557గా నమోదైంది. వాయు నాణ్యత సూచీ సున్నా నుంచి 50 మధ్య నమోదైతే గాలి నాణ్యంగా ఉన్నట్లు, 401 నుంచి 500 ఉంటే పరిస్ధితి తీవ్రంగా ఉన్నట్లు పరిగణిస్తారు. వాయు నాణ్యత చాలా క్షీణించిన నేపథ్యంలో దిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో ప్రజలు బహిరంగ కార్యక్రమాలను పరిమితం చేసుకోవాలని, ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలు తమ వాహనాల వినియోగాన్ని కనీసం 30శాతం తగ్గించుకోవాలని అధికారులు సూచించారు.
ఇదీ చూడండి:- Air Pollution: ఉసురు తీస్తున్న వాయుకాలుష్యం