ETV Bharat / bharat

సాగు చట్టాలను నిరసిస్తూ ఉపాధ్యాయుడు ఆత్మహత్య - సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయుడు మృతి

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హరియాణాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు సామాజిక మాధ్యమంలో లైవ్​లోకి వచ్చిన ఆయన.. రైతులకు మద్దతుగా తాను పురుగుల మందు తాగుతున్నట్టు తెలిపారు.

school teacher commits suicide in support of farmers in rohtak
సాగు చట్టాలను నిరసిస్తూ ఉపాధ్యాయుడు ఆత్మహత్య
author img

By

Published : Apr 7, 2021, 11:06 AM IST

సాగుచట్టాలను నిరసిస్తూ హరియాణాలోని రోహ్​తక్​కు చెందిన ముకేశ్​ దాగర్​ అనే ఉపాధ్యాయుడు.. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అంతకుముందు సామాజిక మాధ్యమంలో లైవ్​లోకి వచ్చి.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపారని పోలీస్​ అధికారులు వివరించారు.

రెండుసార్లు లైవ్​లోకి..!

ముకేశ్.. ఆత్మహత్యకు ముందు రెండుసార్లు ఫేస్​బుక్​ లైవ్​లోకి వచ్చినట్లు డీఎస్పీ గౌర్​ఖాపాల్ రాణా తెలిపారు. లైవ్​ వీడియోలో తాను పురుగుల మందు తాగుతున్నట్లు చెప్పారని రాణా వివరించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించామన్నారు.

ఇదీ చదవండి : పోలీసుల క్రూరత్వం- మాస్కు లేదని.. నడిరోడ్డుపై!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.