ETV Bharat / bharat

సెలవులే లేని బడి- 365 రోజులు, నిత్యం 14 గంటలు క్లాసులు- పిల్లలకు సూపర్​ ఫన్​, ఇన్​కమ్​! - మహారాష్ట్ర 365 డేస్ నడిచే స్కూల్

School Open In 365 Days : ఆ బడికి అసలు సెలవులే ఉండవు. పిల్లలంతా ఏడాదిలో 365 రోజులు పాఠశాలకు వెళ్లాల్సిందే. రోజుకు 14 గంటలు 'పాఠాలు' వినాల్సిందే. అలా అని ఆ బడిలోని విద్యార్థులు ఎవరూ అలసిపోరు! రోజంతా అక్కడే ఉండి, ఆడుతూపాడుతూ 'బతుకు పాఠాలు' నేర్చుకుంటున్నారు. జ్ఞానంతోపాటు డబ్బులు కూడా సంపాదించి తల్లిదండ్రులకు ఆర్థికంగా ఆసరా కల్పిస్తున్నారు.

School Open In 365 Days
School Open In 365 Days
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 3:52 PM IST

సెలవులే లేని బడి- 365 రోజులు, నిత్యం 14 గంటలు క్లాసులు

School Open In 365 Days : ఈ బడి ఏడాదిలో 365 రోజులూ పనిచేస్తుంది. అది కూడా ఉదయం ఏడు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు. ఆశ్చర్యంగా ఉందా? మహారాష్ట్ర నాసిక్​ జిల్లా త్రయంబకేశ్వర్ మండలం హివాలీలో ఉందీ పాఠశాల. సెలవులే లేకుండా రోజుకు 14గంటలు పనిచేయడం దీని ప్రత్యేకత.

School Open In 365 Days
స్కూల్​లో చదువుకుంటున్న విద్యార్థులు

"మా బడి ఏడాదిలో 365 రోజులు ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు నడుస్తుంది. ఈ 14 గంటల్లో మేము వ్యవసాయం, పశువుల పెంపకం, చదవడం వంటి అనేక పనులు చేస్తాం."
--కిరణ్ అంబాదాస్​ భోయే, విద్యార్థి

"పెద్ద పిల్లలు తమకన్నా చిన్నవారికి చదువు చెబుతారు. కేజీ నుంచి 6వ తరగతి వరకు విద్యార్థులు అందరినీ బృందాలుగా విభజించారు. ప్రతి విద్యార్థి ఓ బృందంలో సభ్యునిగా ఉంటారు. పెద్ద పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో సబ్జెక్ట్ తీసుకుంటారు. చిన్నవారికి సైన్స్, మ్యాథ్స్, వ్యాసరచన వంటివన్నీ చక్కగా నేర్పిస్తారు."
--ప్రతీక్షా రామ్​దాస్​ భుసారే, విద్యార్థి

కుటుంబానికి అండగా సవ్యసాచి విద్యార్థులు
ఇక్కడి విద్యార్థులందరికీ పెద్దపెద్ద ఎక్కాలు వచ్చు. వీరంతా ఒకేసారి రెండు చేతులతోనూ రాయగల సవ్యసాచులు. విద్యార్థులు బడిలోనే కూరగాయలు పెంచుతారు. వాటిని మార్కెట్​లో అమ్మి, వచ్చిన డబ్బులు ఇంట్లో ఇస్తారు.

School Open In 365 Days
స్కూల్ ఉన్న గుడారం

"మా బడికి భవనం ఏమీ లేదు. టార్పాలిన్ షీట్​ కిందే ఉంటుంది. ఒక్కోసారి మేము పొలానికి వెళ్తాం. అక్కడి నుంచి వంకాయలు, గుమ్మడికాయలు, వేరుశెనగ, టమోట, బెండకాయలు వంటివి అమ్మేందుకు మార్కెట్​కు వెళ్తాం."
--మహేశ్వరీ మోరే, 8వ తరగతి విద్యార్థి

వారి జీవితాలు మార్చాలన్న సంకల్పం
ఈ బడి ఇంత ప్రత్యేకంగా నిలవడానికి కారణం కేశవ్ గావిత్. రాజనీతి శాస్త్రంలో ఎమ్​ఏ చేసిన ఆయన ఐఏఎస్​ కావాలనుకున్నారు. కానీ, పేదరికం వల్ల ఆ కల నెరవేరలేదు. అయినా కేశవ్ ఏమాత్రం నిరాశ చెందలేదు. హివాలీ గ్రామంలోని గిరిజనుల జీవితాల్ని మార్చాలని సంకల్పించుకున్నారు. టీచర్​గా మారి అక్కడి పిల్లలకు చదువు చెబుతున్నారు.

School Open In 365 Days
స్కూల్​లో చదువుకుంటున్న విద్యార్థులు

"నేను 2009లో ఇక్కడకు వచ్చినప్పుడు రోడ్లు, విద్యుత్ వంటి సదుపాయాలు ఏమీలేవు. 7ఏళ్లు బడికి నడిచే వచ్చా. ఇక్కడి విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించే ప్రయత్నం చేశా. ఇందుకు చాలా ఏళ్లు పట్టింది. 2014-15నాటికి విద్యార్థులు కొన్ని నైపుణ్యాలు సాధించారు. 2016 నుంచి ఈ బడి ఏడాదికి 365 రోజులు నడుస్తోంది."
--కేశవ్ గావిత్, ఉపాధ్యాయుడు

వృత్తి నైపుణ్య శిక్షణ
గిరిజన తండా అయిన హివాలీ జనాభా దాదాపు 250. కనీస సౌకర్యాలు అంతంతమాత్రమే. మొబైల్​ సిగ్నల్​ కోసం ఊరికి 2-3కిలోమీటర్లు వెళ్లాల్సిన దుస్థితి. అలాంటి గ్రామంలో ఉన్న ఈ పాఠశాలలో.. 9వ తరగతి వరకు మొత్తం 55 మంది చదువుకుంటున్నారు. మామూలు సిలబస్​తోపాటు ఈ బడిలో విద్యార్థులకు వృత్తివిద్యా శిక్షణ కూడా లభిస్తుంది. ప్లంబింగ్, వెల్డింగ్, ఎలక్ట్రికల్ రిపేర్స్, కార్పెంట్రీ వంటి పనుల్ని ఇక్కడి విద్యార్థులు నేర్చుకుంటారు.

"పెద్దయ్యాక అందరికీ ప్రభుత్వ ఉద్యోగం రాకపోవచ్చు. కానీ, వారు ఎంతో కొంత సంపాదించుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేలా వృత్తివిద్యా శిక్షణ ద్వారా మేము ప్రయత్నిస్తున్నాం."
--కేశవ్ గావిత్, ఉపాధ్యాయుడు

గుడారంలో ఉండే ఈ బడిలోని పైకప్పును, గోడలను విద్యార్థులే అందంగా అలంకరించారు.

School Open In 365 Days
గోడలపై అందమైన చిత్రాలు

స్టూడెంట్స్​ ఫిట్​నెస్​ కోసం ప్రిన్సిపల్​ 'ఎగ్​ ఛాలెంజ్'​- రోజూ 6కి.మీ రన్నింగ్​ చేస్తే గిఫ్ట్​లుగా గుడ్లు!

'అమ్మా మీ పిల్లలను స్కూల్​కు పంపండి ప్లీజ్​' రోజూ గ్రామంలోని ఇంటింటికీ వెళ్తున్న టీచర్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.