ప్రజా ప్రతినిధుల కేసులపై సత్వర విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్‌పై వచ్చే వారం నుంచి వాదనలు ఆలకించనున్నట్లు దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు తగిన నివేదికలతో సిద్ధమవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రతినిధుల కేసులను దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక కోర్టుల విచారణ పరిధిపై హైకోర్టులకు భిన్నాభిప్రాయాలున్నట్లు సీజేఐ పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ఇతర ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ జాప్యం జరగడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది. వారిపై నమోదైన కేసులను సత్వరం విచారణ జరిగేలా ఆదేశించాలని పిటిషనర్ సుప్రీం కోర్టును కోరారు. ఈ విషయమై న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ కోర్టు ముందుకు ఈ ప్రస్తావన తీసుకురాగా... దీనిపై వచ్చే వారం విచారణ ప్రారంభించనున్నట్లు సీజేఐ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఫడణవీస్‌పై మాలిక్ 'హైడ్రోజన్ బాంబ్'- దావూద్‌కు ముడిపెడుతూ...