ETV Bharat / bharat

రైతు నిరసనలపై ఈనెల 11న సుప్రీం విచారణ

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళన విషయంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. రైతుల ఆందోళనలు, సాగు చట్టాలపై దాఖలైన పిటిషన్లపై విచారణలో భాగంగా సీజేఐ జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే ఈ వ్యాఖ్యలు చేశారు. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేశారు.

SC to hear on January 11 pleas challenging new farms laws and issues related to ongoing farmers' protest at Delhi borders
రైతన్నల ఆందోళనలపై ఈ నెల 11న సుప్రీ విచారణ
author img

By

Published : Jan 6, 2021, 12:16 PM IST

Updated : Jan 6, 2021, 12:34 PM IST

దిల్లీలో రైతుల ఆందోళన, సాగు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఈ నెల 11 విచారించనున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ సందర్భంగా.. రైతుల ఆందోళన విషయంలో క్షేత్రస్థాయిలో ఎలాంటి పురోగతి తమకు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు సీజేఐ జస్టిస్​ బోబ్డే. ఈ నేపథ్యంలో రైతులు-కేంద్రం మధ్య చర్చలు జరుగుతున్నాయని అటార్నీ జనరల్​ కే.కే. వేణుగొపాల్​ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. సమీప భవిష్యత్తులో ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో.. సాగు చట్టాలపై దాఖలైన పిటిషన్లపై కేంద్రం తన స్పందనను అందిస్తే.. రైతులు-ప్రభుత్వం మధ్య సంప్రదింపులు దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- 'జనవరి 7న దిల్లీ సరిహద్దుల్లో ట్రాక్టర్​ ర్యాలీ'

Last Updated : Jan 6, 2021, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.