ETV Bharat / bharat

జడ్జి హత్య కేసులో సుప్రీం కీలక ఆదేశాలు - జడ్జి హత్యకేసు

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఝార్ఖండ్​లోని జిల్లా అదనపు న్యాయమూర్తి హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి వారంలోగా నివేదిక సమర్పించాలని ఝార్ఖండ్ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించింది.

SC
సుప్రీంకోర్టు
author img

By

Published : Jul 30, 2021, 1:03 PM IST

ఝార్ఖండ్​లోని జిల్లా అదనపు న్యాయమూర్తి హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన క్రమంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుంది. జుడీషియల్​ అధికారులపై దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ ఎన్​.వి. రమణ, జస్టిస్​ సూర్యకాంత్​తో కూడిన ధర్మాసనం.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది.

వారంలోగా నివేదిక..

ఈ కేసుకు సంబంధించి వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఝార్ఖండ్ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించింది. ఝార్ఖండ్​ హైకోర్టు ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​.వి. రమణ స్పష్టం చేశారు.

బుధవారం తెల్లవారుజామున వాకింగ్​కు వెళ్లిన న్యాయమూర్తి ఉత్తమ్​ ఆనంద్​ను.. దుండగులు ఆటోతో వెనుక నుంచి ఢీ కొట్టారు. ఈ ఘటనలో.. తీవ్రంగా గాయపడిన న్యాయమూర్తిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి: జడ్జి హత్యపై దుమారం- అసలు కారణాలేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.