భారత నౌకాదళంలో మూడు దశాబ్దాలకుపైగా సేవలందించిన ఐఎన్‌ఎస్ విరాట్ విమాన వాహక నౌకను తుక్కుగా మార్చాలన్న కేంద్రం నిర్ణయంపై స్టే విధించింది సుప్రీం కోర్టు. యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది.
విరాట్ నౌకను.. తుక్కుగా మార్చటానికి బదులుగా మ్యూజియంగా మార్చాలని ఓ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డె నేతృత్వంలోని ధర్మాసం విచారణ చేపట్టింది. అభిప్రాయం చెప్పాలని ఆదేశిస్తూ కేంద్రంతో పాటు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది.
బ్రిటన్ నుంచి భారత్‌కు
విరాట్ నౌక జీవిత కాలం పూర్తయ్యింది. దీంతో 2017 మార్చిలోనే నౌకాదళం నుంచి దీనిని ఉపసంహరించారు అధికారులు. అప్పటి నుంచి ముంబయి తీరంలో ఉంది. మొదట దీనిని మ్యూజియంగా కానీ రెస్టారెంట్‌గా గానీ మార్చేందుకు ప్రయత్నించారు. కానీ, ఆ ప్రణాళికలు ఫలించలేదు. దీంతో తుక్కుగా మార్చి, విక్రయించేందుకు నిర్ణయించారు.
ఐఎన్‌ఎస్ విరాట్ తొలుత బ్రిటన్ కు చెందిన రాయల్ నేవీలో హెచ్‌ఎంఎస్ హెర్మిస్‌గా సేవలందించింది. అనంతరం భారత నావిక దళంలోని ప్రవేశించి 30 ఏళ్ల పాటు సేవలందించింది.
ఇదీ చూడండి: 30 ఏళ్లపాటు సేవలందించిన నౌక ఆఖరి యాత్ర